Hanuman 14 days Collections హనుమాన్ రికార్డుల ఊచకోత ..14వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
వరల్డ్ బాక్సాఫీస్ వద్ద హనుమాన్ చిత్రం కలెక్షన్ల జోరు కొనసాగిస్తున్నది. యువ నిర్మాత కే నిరంజన్ రెడ్డి నిర్మాణంలో సైంటిఫిక్, ఫిక్షన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో భారీగా కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా, వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన ఈ సినిమా రికార్డు వసూళ్లు నమోదయ్యాయి. ఈ సినిమా 14 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
హనుమాన్ చిత్రం రెండోవారం పూర్తి చేసుకొని మూడో వారంలోకి ప్రవేశించింది. ఈ సినిమా తొలి వారంలోనే ఇండియాలో 100 కోట్ల నికర కలెక్షన్లు రాబట్టింది. తెలుగులో 74 కోట్లు, హిందీ 25 కోట్లు, తమిళంలో 1.5 కోట్లు, కన్నడలో 3 కోట్లు, మలయాళంలో 50 లక్షల నికర వసూళ్లు సాధించింది.

ఇక రెండోవారంలో హనుమాన్ సినిమా తొలివారం కంటే ఎక్కువ జోష్‌ను చూపించింది. ఈ సినిమా రెండోవారంలో తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్లు, హిందీలో 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కన్కడ, తమిళ, మలయాళ చిత్రాల్లో కలిపి ఈ సినిమా మొత్తంగా 50 కోట్ల రూపాయలు నికరంగా వసూలు చేసింది.
హనుమాన్ చిత్రం 14వ రోజు కూడా భారీగానే వసూళ్లను రాబట్టింది. తెలుగులో 3 కోట్ల రూపాయలు నికరంగా, హిందీలో 1 కోటి రూపాయలు, తమిళంలో 10 లక్షలు, కన్నడలో 30 లక్షలు, మలయాళంలో 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ మూవీ 4.5 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఇటీవల కాలంలో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించిన సినిమా ఇదే అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

హనుమాన్ మూవీ నైజాంలో కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నది. ఈ సినిమా గత రెండు వారాల్లో రికార్డు స్తాయి బిజినెస్ చేసింది. తొలివారం 25 కోట్లు, రెండోవారంలో 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా రెండువారాల్లో 40 కోట్ల రూపాయల షేర్ కేవలం నైజాంలోనే వసూలు చేసింది.
గత రెండువారాల్లో హనుమాన్ సినిమా బాక్సాఫీస్ రిపోర్టు విషయానికి వస్తే.. ఇండియాలో మొత్తంగా 175 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 48 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 220 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. 60 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టిన ఈ చిత్రం ఇప్పటికే ఊహించని లాభాలను సొంతం చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











