Hanuman Day 15 Collections హనుమ్యాన్ మాస్ జాతర.. ఓ రేంజ్‌లో మాస్ కుమ్ముడు.. 8వ రోజు ఎంతంటే?
టాలీవుడ్‌లో యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన సైంటిఫిక్ ఫిక్షన్ చిత్రం హనుమ్యాన్. తేజా సజ్జా హీరోగా అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, గెటప్ శ్రీను, వినయ్ తదితరులు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. కే నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ట్రేడ్ వర్గాల అంచనాలను తలకిందులు చూస్తూ రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్నది. గత రెండు వారాల్లో ఎంత వసూలు చేసింది? 15 వరోజు ఏ రేంజ్ వసూళ్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
Recommended Video

హనుమ్యాన్ చిత్రం 60 కోట్ల బడ్జెట్ 28 కోట్ల టార్గెట్‌తో పరిమితమైన కలెక్షన్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ దశలోను బాక్సాఫీస్ వద్ద వెను దిరగలేదు. ప్రపంచవ్యాప్తంగా రిలీజైన అన్ని సెంటర్లలోను ప్రతీ వర్గాన్ని అకట్టుకొంటూ సంచలన కలెక్షన్లను రాబడుతున్నది. మూడో వారంలో కూడా ఈ సినిమా అద్బుతమైన విజయంతో దూసుకెళ్తున్నది.

హనుమ్యాన్ చిత్రం రెండో వారంలో ఇండియాలో 59 కోట్ల రూపాయల వసూళ్లను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. తెలుగులో 42 కోట్లు, హిందీలో 16 కోట్లు, తమిళంలో 60 లక్షలు, కర్ణాటకలో 70 లక్షలు, మలయాళంలో 15 లక్షల వసూళ్లను రాబట్టింది. అన్ని భాషల్లోను ఈ సినిమా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నది.
సంక్రాంతి పండగ బరిలో భారీ పోటీని, అగ్ర హీరోల సినిమాలను తట్టుకొని తొలివారంలో అన్ని భాషల్లో కూడా రికార్డు వసూళ్లు సాధించింది. ఈ సినిమా తొలివారం 100 కోట్లు సాధిస్తే.. అదే జోష్‌తో రెండోవారం 59 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలోనే 159 కోట్ల వసూళ్లను రాబట్టింది.

హనుమ్యాన్ చిత్రం 15వ రోజున ఇతర సినిమాలతో పోల్చుకొంటే రికార్డు కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమా ఆంధ్రా, నైజాంలో కలిపి 6.75 కోట్ల రూపాయలు, హిందీలో 1.6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 8.75 కోట్ల రూపాయలు నికరంగా బాక్సాఫీస్ వద్ద రాబట్టింది.

హనుమ్యాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ ఓవర్సీస్‌లో 48.5 కోట్లు వసూలు చేసింది. ఇండియావ్యాప్తంగా 175 కోట్ల గ్రాస్, 150 కోట్ల షేర్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఓవరాల్‌గా 225 కోట్ల వసూళ్లను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ సినిమా భారీ లాభాలతో కొనసాగుతున్నది.


Click it and Unblock the Notifications











