Hanuman 16 Days Collections హనుమాన్ టార్గెట్ 300 కోట్లు.. 16వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
హనుమాన్ చిత్రం మూడో వారంలో కూడా భారీగా వసూళ్లు రాబడుతున్నది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా కేవలం వీకెండ్స్, హాలీడేస్‌లోనే కాకుండా వర్కింగ్ డే రోజున కూడా భారీగా వసూళ్లు రాబడుతున్నది. తేజా సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన ఈ చిత్రం 15 రోజుల్లోనే 250 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సినిమా 16వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
హనుమ్యాన్ చిత్రం గత రెండు వారాల వసూళ్ల వివరాల్లోకి వెళితే.. ఆంధ్ర, నైజాంలో ఈ మూవీ 112 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కర్ణాటకలో 19 కోట్లు నికరంగా, తమిళనాడులో 3 కోట్ల రూపాయలు, మలయాళంలో 1 కోటి నికర వసూళ్లను, అలాగే హిందీలో 50 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 184 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక హనుమ్యాన్ సినిమాకు ఓవర్సీస్‌లో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాను అమెరికా, కెనడా, యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాల్లో రిలీజ్ చేశారు. గత 15 రోజుల్లో ఈ సినిమా 56 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇంకా బలంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబడుతున్నది.
ఇక హనుమ్యాన్ చిత్రం 16 రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. విడుదలైన ప్రతీ సెంటర్‌లో మంచి ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఈ సినిమా ఓవరాల్‌లో 45 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది. నైజాంలోను, ఉత్తరాంధ్రలోను ఈ సినిమాకు భారీ ఆక్యుపెన్సీ నమోదు చేసుకొన్నది.
అలాగే హనుమ్యాన్ చిత్రం 16వ రోజు భారీగానే వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా ఇండియాలో కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయల నికరంగా, హిందీలో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 6.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 16 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 15 రోజుల్లో 250 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇక 16వ రోజున 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ మూవీ 266 కోట్లకపైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా 28 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో మొదలుపెట్టి.. వందల కోట్ల రూపాయల లాభాలను సాధించిపెట్టింది.


Click it and Unblock the Notifications











