Hanuman Day 17 Collections అరుదైన రికార్డుకు చేరువగా హనుమ్యాన్.. 17వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
హనుమ్యాన్ చిత్రం (HanuMan) 3వ వారంలో కూడా కలెక్షన్ల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఎవరూ ఊహించని వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. యువ హీరో తేజా సజ్జా నటించిన ఈ చిత్రం 17వ రోజు కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? ఏ మేరకు లాభాలను రాబట్టిందనే విషయాల్లోకి వెళితే..
హనుమ్యాన్ చిత్రం (HanuMan) చిత్రం ఎవరు ఊహించని విధంగా వసూళ్లను సాధిస్తున్నది. గత 15 రోజుల్లో సంక్రాంతికి రిలీజైన సినిమాలను వెనక్కి నెట్టి రికార్డులను నమోదు చేసింది. ఇప్పటి వరకు ఈ మూవీ 250 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. ఈ మూవీ సుమారుగా 300 కోట్ల వసూళ్లను 3వ వారం నమోదు చేసే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నది.

హనుమ్యాన్ మూవీ ఇండియాలో తొలివారం 100 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇక రెండోవారంలో 59 కోట్లరూపాయల నికర వసూళ్లను రాబట్టింది. 16వ రోజున 6.5 కోట్ల రూపాయల నికరంగా రాబట్టింది. దాంతో ఈ సినిమా భారీ లాభాలను నమోదు చేసింది.
హనుమ్యాన్ చిత్రం (HanuMan) చిత్రం గత 16 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ మూవీ 255 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇండియాలో 200 కోట్లకుపైగా కలెక్షన్లను రాబడుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో 128 కోట్లు వసూలు చేయగా.. ఓవర్సీస్‌లో 57 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హిందీలో 45 కోట్ల రూపాయలు కలెక్షన్లు నమోదు చేసింది.

హనుమ్యాన్ సినిమా 17వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తెలుగులో 6.5 కోట్లు నికరంగా, హిందీలో 1.75 కోట్లు నికరంగా రాబట్టింది. దాంతో ఈ సినిమా 8.25 కోట్ల కలెక్షన్లను ఇండియాలో నికరంగా, 12 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. మూడో వారంలో కూడా ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఉత్సాహానికి గురిచేస్తున్నది.

హనుమ్యాన్ చిత్రం 60 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 275 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ఈ చిత్రం త్వరలోనే 300 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. దీంతో మీడియం బడ్జెట్ సినిమాగా వచ్చి భారీ కలెక్షన్లు సాధించిన అరుదైన చిత్రంగా రికార్డు క్రియేట్ చేయనున్నది.


Click it and Unblock the Notifications











