Hanuman Day 19 Collections యూఎస్, యూకేలో హనుమాన్ సంచలన రికార్డు.. 19వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

హనుమ్యాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల మోత మోగిస్తూనే ఉంది. జనవరి 12వ తేదీన వరల్డ్ వైడ్‌గా విడుదలైన ఈ చిత్రం అప్పటి నుంచి భారీ వసూళ్లను సాధిస్తూనే ఉంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 250 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను నమోదు చేసింది. తేజా సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన ఈ సినిమా 19 రోజుల్లో ఏ మేరకు కలెక్షన్లను వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..

ఓవర్సీస్‌లో హనుమాన్ సినిమాకు భారీ ఆదరణ లభించింది. ఈ సినిమా యూకేలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు యూకే, ఐర్లాండ్‌లో రిలీజైన తెలుగు చిత్రాల్లో టాప్ 5 చిత్రాల్లో హనుమ్యాన్ మూవీ ఒకటిగా నిలిచింది.

Hanuman Day 19 Box Office Collections Worldwide: Prashanth Varma film entered in Top 5 of UK

ఇక ఉత్తర అమెరికాలో బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా అమెరికా, కెనడాలో కలిపి మొత్తంగా 5 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు రిలీజైన తెలుగు సినిమాల కలెక్షన్లను పరిశీలిస్తే.. టాప్ 5 ఒకటిగా నిలిచింది. అమెరికాలో 4.7 మిలియన్ డాలర్లు, కెనడాలో 325K డాలర్లు రాబట్టింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అమెరికా, యూకే‌తోపాటు గల్ఫ్, యూఏఈ దేశాల్లో భారీగా వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో 58 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Hanuman Day 19 Box Office Collections Worldwide: Prashanth Varma film entered in Top 5 of UK

ఇక ఇండియాలో మూడో వారంలో కూడా నిలకడగా వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా 16వ రోజు 6.5 కోట్లు, 17వ రోజు 7.7 కోట్లు, 18వ రోజు 2 కోట్లకుపైగా, మూడో రోజు 2 కోట్లకుపైగా నికర వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి 177 కోట్లు రాబట్టింది.

ఇక హనుమాన్ చిత్రం ఇండియాలో 20వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగులో ఈ చిత్రం 1.5 కోట్ల రూపాయలు, హిందీలో 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ఇండియాలో మొత్తంగా 2.5 కోట్లు నికరంగా, ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది.

Hanuman Day 19 Box Office Collections Worldwide: Prashanth Varma film entered in Top 5 of UK

ఇక హనుమాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 270 కోట్ల రూపాయల గ్రాస్, 140 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇండియాలోనే ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఈ సినిమా 28 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజై ఇప్పటి వరకు 110 కోట్ల రూపాయల లాభాన్ని పంచిపెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X