Hanuman 21 Day Collections 300 కోట్లకు చేరువగా హనుమాన్.. ఎన్ని కోట్ల లాభమో ఊహించగలరా?

దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన హనుమాన్ చిత్రం గత మూడు వారాలుగా బాక్సాఫీస్‌‌ను రఫాడిస్తున్నది. సాధారణంగా సెలవు దినాల్లో, లేదా వీకెండ్స్‌లో సినిమాలకు ప్రేక్షకులు వస్తుంటారు. కానీ ఈ సినిమా విషయంలో వర్కింగ్ డే రోజున కూడా జనం భారీగా తరలివస్తున్నారు. తేజా సజ్జా, అమృతా అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు నటించిన ఈ సినిమా గత 21 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..

హనుమాన్ సినిమా ఇండియాలో భారీగా కలెక్షన్లు రాబట్టింది. తొలి వారం 100 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. తెలుగు, హిందీలోనే కలిపి 100 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది. మలయాళం, కన్నడ, తమిళంలో కూడా భారీగానే రెస్పాన్స్ కనిపించింది. ఇక రెండో వారంలో ఈ సినిమా 59 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా రెండోవారంలోనే ఇండియాలో 160 కోట్ల రూపాయలు రాబట్టింది.

Hanuman Day 21 Box Office Collections Worldwide: Teja Sajja Movie Inching to 300 Crores

ఇక మూడో వారంలో కూడా హనుమాన్ బాక్సాఫీస్ హవా కొనసాగింది. 16వ రోజు నుంచి 20 రోజుల వరకు ఇండియాలో తెలుగు, హిందీలో కలిపి 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 180 కోట్ల రూపాయలు స్వదేశంలో వసూలు చేసింది.

ఇక 21వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. హనుమాన్ చిత్రం ఇండియాలో 1 కోటి రూపాయల వసూళ్లను నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 300 కోట్ల రూపాయల టార్గెట్‌కు చేరువైంది.

ఇక హనుమాన్ మూవీ ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అమెరికా, యూకే, గల్ఫ్ దేశాల్లో సుమారుగా 60 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇండియాలో 180 కోట్ల రూపాయలు నికరంగా, 216 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 275 కోట్ల గ్రాస్, 140 కోట్ల షేర్ వసూళ్లను నమోదు చేసింది.

Hanuman Day 21 Box Office Collections Worldwide: Teja Sajja Movie Inching to 300 Crores

హనుమాన్ చిత్రం 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. థియేట్రికల్ బిజినెస్ సమారుగా 28 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమా ఇప్పటికే 110 కోట్లకుపైగా లాభాలను పంచింది. ఇటీవల కాలంలో రికార్డు వసూళ్లు నమోదు చేసిన సినిమాగా ఈ చిత్రం ఘనతను సొంతం చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X