Hanuman Day 25 Collections ప్రశాంత్ వర్మ మూవీకి 25వ రోజున రికార్డు కలెక్షన్లు.హనుమ్యాన్‌కు ఎన్ని కోట్ల లాభమంటే
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన హనుమ్యాన్ ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నది. సంక్రాంతి బరిలో జనవరి 12వ తేదీన రిలీజైన ఈ చిత్రం భారీ బడ్జెట్ చిత్రాలను వెనక్కి నెట్టి మూడువారాలుగా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా నటించగా, కే నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం 300 గ్రాస్ కలెక్షన్లను అధిగమించింది. ఈ సినిమా 25వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో హనుమ్యాన్ చిత్రం గత 25 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో ఈ సినిమా 39 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 11.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 11.7 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 8 కోట్ుల, పశ్చిమ గోదావరి జిల్లాలో 5.2 కోట్లు, గుంటూరులో 5 కోట్లు, కృష్ణా జిల్లాలో 4.75 కోట్లు, నెల్లూరులో 2.5 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. దాంతో మొత్తంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 90 కోట్ల షేర్, 142 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

ఇక ఇండియా వ్యాప్తంగా వసూళ్ల వివరాల్లోకి వెళితే.. తొలివారం తెలుగులో 66 కోట్ల రూపాయలు, హిందీలో 23 కోట్లు, తమిళంలో 1 కోటి రూపాయల, కర్ణాటకలో 5 కోట్ల రూపాయలతో కలిపి ఈ సినిమా 90 కోట్లు రాబట్టింది. రెండోవారం స్టడీగా వసూళ్లు రాబట్టి 60 కోట్లు కలెక్ట్ చేసింది. మూడో వారంలో 30 కోట్లు వసూలు చేసింది.
హనుమ్యాన్ చిత్రం నాలుగో వారంలో 22వ రోజు 1.45 కోట్లు, 23వ రోజు 3 కోట్లు, 24వ రోజు 4 కోట్ల రూపాయలు, 25వ రోజు 2.5 కోట్ల రూపాయలు నికరంగా, 4 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియావైడ్‌గా 222 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది.

ఇక భాషల వారీగా హనుమ్యాన్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కన్నడలో 22 కోట్లు, తెలుగులో 138 కోట్లు, తమిళంలో 4 కోట్ల రూపాయలు, మలయాళంలో 1 కోటి రూపాయలు, హిందీలో 59 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 222 కోట్లు నికరంగా కలెక్షన్కలను సాధించింది. ఓవర్సీస్‌లో కోట్ల కలెక్షన్లు కలిపి ఈ చిత్రం 282 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.
హనుమ్యాన్ సినిమా సుమారుగా 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకుపైగా షేర్ సాధించింది. దాంతో ఈ చిత్రం ఇప్పటికే 120 కోట్ల రూపాయలుకుపైగా లాభాలను పంచిపెట్టింది. ఇంకా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది.


Click it and Unblock the Notifications











