HanuMan Day 3 Collections 100 కోట్ల కలెక్షన్లకు చేరువగా హనుమాన్.. 3వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యువ హీరో తేజా సజ్జా కాంబినేషన్‌లో కే నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం హనుమాన్. అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
Recommended Video

హనుమాన్ సినిమాను చిన్న సినిమాగా ప్రారంభించినప్పటికీ.. టీజర్‌కు భారీ రెస్సాన్ రావడంతో దాని స్పాన్ పెరిగిపోయింది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించి పాన్ ఇండియా వైడ్‌గా సినిమాను రిలీజ్ చేశారు. దాదాపు ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నిషియన్ల రెమ్యునరేషన్లు, ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాను 75 కోట్ల బడ్జెట్ అయింది.

హనుమాన్ మూవీ రిలీజ్‌కు ముందు భారీ బజ్ రావడంతో ప్రేక్షకుల నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే గుంటూరు కారం సినిమాకు ఎక్కువగా థియేటర్లు కేటాయించడంతో కొంత వివాదంగా చర్చ జరిగింది. అయితే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.హిందీలో 1500 స్క్రీన్ుల, ఏపీ, నైజాంలో 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
హనుమాన్ సినిమా 28 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. తొలి రోజు ఏపీ, నైజాంలో 5 కోట్ల గ్రాస్, ఇండియాలో 7 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడంతో మొత్తంగా ఈ మూవీ 10 కోట్ల గ్రాస్ వసూళ్లను పెయిడ్ ప్రీమియర్ల రూపంలోను, తొలి రోజు కలెక్షన్లుగా నమోదు చేసింది.
హనుమాన్ సినిమా రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. భారీ వృద్ధిని సాధించింది. తెలుగులో 8.5 కోట్ల రూపాయలు, హిందీలో 2.1 కోట్లు, తమిళంలో 30 లక్షలు, కన్నడలో 50 లక్షలు, మలయాళంలో 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 13 కోట్ల మేర వసూల్లను సాధించింది.

ఇక మూడో రోజు హనుమాన్ సినిమా తొలి రెండు రోజుల కంటే అత్యధిక వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ తెలుగు, ఇతర రాష్ట్రాల్లో కలిపి 16 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. హిందీలో ఈ సినిమా 4 కోట్లు రాబట్టే అవకాశం ఉంది.
హనుమాన్ సినిమా 3 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ హిందీలో 12 కోట్ల నెట్, తెలుగు, ఇతర భాషల్లో 42 కోట్లు, 50 కోట్ల వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లో రాబట్టిన 12 కోట్లతో కలిపి ఓవరాల్‌లో ఈ సినిమా 66 కోట్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరడానికి అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











