Hanuman Day 4 Collections కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్మురేపుతున్న హనుమాన్.. 4వ రోజు రేర్ రికార్డుకు చేరువగా!
సంకాంత్రి బరిలో దూకిన హనుమాన్ మూవీ పరిమిత థియేటర్లలో రిలీజై భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. రిలీజ్ తర్వాత పబ్లిక్ డిమాండ్ పెరిగిపోవడంతో ఎక్కవ స్క్రీన్లలో ప్రదర్శించబడుతున్నది. విడుదలైన అన్ని చోట్ల భారీగా వసూళ్లు రాబడుతున్నది. ఇక నాలుగు రోజుల్లో ఈ సినిమా సుమారుగా 100 కోట్లకు చేరువ అవుతున్నది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజా సజ్జా నటించిన ఈ సినిమా 4వ రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..
Recommended Video

నిర్మాత కే నిరంజన్ రెడ్డి తెలిపిన ప్రకారం ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి హనుమాన్ సినిమా సుమారుగా 75 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 28 కోట్లుగా జరిగింది. దాంతో ఈ సినిమా 29 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది.

హనుమాన్ చిత్రాన్ని తెలుగులో 500 స్క్రీన్లు, హిందీలో 1500 స్క్రీన్లు, ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 2500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు తొలి రోజు నుంచి భారీగా ఆక్యుపెన్సీ నమోదు అయింది. తొలి రోజు కంటే ప్రతీ రోజుకు ఆక్యుపెన్సీ పెరుగుతూ వస్తున్నది. సంక్రాంతి రేసులో మంచి రెస్పాన్స్ తెచ్చుకొంటున్న చిత్రంగా నిలిచింది.
హనుమాన్ సినిమా ప్రీమియర్ల ద్వారా 4 కోట్లకుపైగా, తొలి రోజు ఏపీ, నైజాంలో 6 కోట్ల షేర్, రెండో రోజు 8.5 కోట్లు, మూడో రోజు 10 కోట్ల వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 24 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఇంకా భారీ వసూళ్లను రాబట్టేందుకు సిద్దమవుతున్నది.
ఇండియా వైడ్‌గా హనుమాన్ సినిమా వసూళ్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రోజు 8 కోట్ల రూపాయలు, రెండో రోజు 12.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హిందీ బెల్ట్‌లో భారీ కలెక్షన్లు సాధిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం మూడో రోజుల్లో 36 కోట్ల షేర్ రాబట్టింది.
గత మూడు రోజుల్లో ఈ చిత్రం 36 కోట్ల షేర్, 49 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. హిందీలో ఈ చిత్రం 12.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో 24 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 75 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. అన్ని చోట్ల అదే ఊపును కొనసాగిస్తున్నది.
ఇక హనుమాన్ సినిమా 4వ రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 12 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 1.5 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక హిందీ, ఓవర్సీస్ కలుపుకొని ఈ సినిమా 30 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సిని్మా 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











