Hanuman Day 6 Collections హనుమాన్ మాస్ బ్యాటింగ్.. 150 కోట్లకు చేరువగా..6వ రోజు ఎన్ని కోట్లంటే?
సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన హనుమాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రవాహన్ని కొనసాగిస్తున్నది. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా, వరలక్ష్మీ శరత్ కుమార్, అమృత అయ్యర్ తదితరులు నటించిన ఈ చిత్రం రికార్డులు తిరగరాస్తున్నది. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద అత్యధికంగా టికెట్లు అమ్మకాలు జరిపిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విడుదలైన రోజు నుంచి నిలకడగా, బలంగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా గత 6 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
హనుమాన్ సినిమా తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ప్రీమియర్ల ద్వారా 4 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. ప్రీమియర్లకు ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజు 6 కోట్ల రూపాయలు, రెండో రోజు 8.5 కోట్లు, మూడో రోజు 9.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 11.5 కోట్లు, 5వ రోజు 10.5 కోట్లు వసూలు చేసింది. ఇక 6వ రోజు 9.5 కోట్లు నికరంగా రాబట్టింది. దాంతో తొలి ఆరు రోజుల్లో ప్రీమియర్లతో కలిపి 59 కోట్ల నికర వసూళ్లను సాధించింది.

ఇక హిందీలో హనుమాన్ సినిమాకు భారీ స్పందన వ్యక్తమైంది. ఈ సినిమాకు తొలి రోజు 2.65 కోట్లు, రెండో రోజు 4 కోట్లు, హిందీ 6 కోట్లు, మూడో రోజు 6 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 4 కోట్ల రూపాయలు, ఐదో రోజు 2.5 కోట్లు, ఆరో రోజు 2.5 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 27.65 కోట్లు వసూలు చేసింది.

హనుమాన్ చిత్రం తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా మూడు భాషల్లో కలిపి సుమారుగా 10 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఇండియా వైడ్‌గా ఈ సినిమా 97 కోట్ల రూపాయల నికర వసూళ్లను నమోదు చేసింది. త్వరలోనే ఇండియాలో ఈ సినిమా 100 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉంది.

ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే.. హనుమాన్ ప్రభంజనం విడుదలైన అన్ని దేశాల్లోను కనిపిస్తున్నది. ఈ సినిమా ఇప్పటికే 4 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో ఈ సినిమా 33 కోట్లు వసూలు చేసింది. 6వ రోజున అంటే వర్కింగ్ డే నాడు 328 లోకేషన్లలో ఈ సినిమా 105,225 డాలర్లు అంటే 87 లక్షల రూపాయలు వసూలు చేసింది.

హనుమాస్ సినిమా 28 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లకుపైగా షేర్.. 135 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇప్పటికే ఈ సినిమా భారీ లాభాలతో కొనసాగుతున్నది. ఈ లాభాల వేట ఎంత మేరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











