Hanuman Day 7 Collections మహేష్, ప్రభాస్ మూవీ రికార్డులను బ్రేక్ చేసిన హనుమాన్.. 7 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన హనుమాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎదురు లేకుండా దూసుకెళ్తున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల కుండపోతను మరిపిస్తున్నది. తెలుగు సినిమా పరిశ్రమలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ సంచలనాలను క్రియేట్ చేస్తున్నది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 7వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
హనుమాన్ సినిమాకు ఓవర్సీస్‌లో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గతవారం రోజులుగా రికార్డులు తిరగరాస్తూ భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా $906,493 డాలర్లు, తొలి రోజు $801,485, రెండో రోజు $810,394, మూడో రోజు $565,233, నాలుగో రోజు $206,852, ఐదో రోజు $117,467 వసూళ్లను సాధించింది.

ఇక హనుమాన్ సినిమా రికార్డుల వేట కొనసాగిస్తున్నది. ఆదిపురుష్ $3.16M మిలియన్లు సాధించగా.. సాహో $3.23M, భరత్ అనే నేను 3.41M డాలర్లు వసూలు చేశాయి. ఈ సినిమాల కలెక్షన్లను నార్త్ అమెరికా అంటే అమెరికా, కెనడాలో హనుమాన్ అధిగమించింది. హనుమాన్ చిత్రం 3.45 మిలియన్ డాలర్లు అంటే.. 29 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
హనుమాన్ తెలుగు స్టేట్స్‌లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 6 కోట్ల రూపాయలు, రెండో రోజు 8.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 10 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 11.20 కోట్లు, ఐదో రోజు 10 కోట్లు, ఆరో రోజు 9 కోట్లు, ఏడో రోజు 7.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగులో 63 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

ఇక హిందీ విషయానికి వస్తే.. తొలి రోజు 2.65 కోట్లు, రెండో రోజు 4 కోట్లు, మూడో రోజు 6 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 3.75 కోట్లు, ఐదో రోజు 2.6 కోట్లు, ఆరో రోజు 2.25 కోట్లు, ఏడో రోజు 2 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 23 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది.

హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. హిందీలో 23 కోట్ల రూపాయలతో కలిపి ఇండియా వైడ్‌గా 111 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లో 29 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 140 కోట్ల రూపాయలు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











