HanuMan 200 కోట్లకు చేరువగా హనుమాన్.. ప్రభాస్, మహేష్, రాంచరణ్ రికార్డులు ఫట్.. 8వ రోజు ఎన్ని కోట్లంటే?

తెలుగు సినిమా పరిశ్రమలో మీడియం రేంజ్ బడ్జెట్‌తో తెరకెక్కిన హనుమాన్ చిత్రం అగ్ర హీరోలు, భారీ బడ్జెట్ చిత్రాల కలెక్షన్ల రికార్డులను అధిగమిస్తూ బాక్సాఫీస్ జైత్ర యాత్రను కొనసాగిస్తున్నది. విడుదలైన ప్రతీ ఏరియాలోను భారీ లాభాలను డిస్ట్రిబ్యూటర్లకు పంచిపెడుతున్నది. హనుమాన్ సినిమా సాధించిన 8వ రోజు ప్రపంచవ్యాప్తంగా నమోదు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

హనుమాన్ సినిమాకు ఓవర్సీస్‌లో ముఖ్యంగా అమెరికాలో భారీ కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద సాహో, ఆదిపురుష్, భరత్ అనే నేను, రంగస్థలం, అరవింద సమేత చిత్రాల వసూళ్లను బ్రేక్ చేసింది. ఇక హనుమాన్ ముందు బాహుబలి1, సలార్, RRR, బాహుబలి 2 సినిమాల కలెక్షన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా సుమారుగా 4 మిలియన్ల వసూళ్లను ఉత్తర అమెరికా అంటే కెనడా, అమెరికాలో వసూలు చేసింది.

Hanuman Day 8 Box Office Collections Worldwide: Prashanth Neel movie Heading towards 200 crores

హనుమాన్ చిత్రం నైజాంలో భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ సినిమా ఇప్పటి వరకు 23 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం నైజాంలో సుమారుగా 40 కోట్ల షేర్ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద బలంగా ఈ సినిమా కనిపిస్తున్నది.

Hanuman Day 8 Box Office Collections Worldwide: Prashanth Neel movie Heading towards 200 crores

గత ఏడు రోజుల్లో హనుమాన్ సినిమా ఆంధ్ర, నైజాం ప్రాంతాల్లో ఊహించని రికార్డులు నమోదు చేస్తున్నది. ఈ సినిమా ఏపీ, నైజాంలో 64 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 11 కోట్ల రూపాయలు, తమిళనాడులో 2 కోట్ల రూపాయలు, కేరళలో ఈ సినిమా 1 కోటి రూపాయలు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 29 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 104 కోట్ల రూపాయల కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది.

Hanuman Day 8 Box Office Collections Worldwide: Prashanth Neel movie Heading towards 200 crores

ఇక హనుమాన్ చిత్రం 8వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ తెలుగులో 8 కోట్ల నికరంగా, హిందీలో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఈ సినిమా ఎనిమిదో రోజు 10 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఇండియాలో ఈ సినిమా 99 కోట్ల షేర్, 104 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. గత 90 ఏళ్లలో మీడియం రేంజ్ బడ్జెట్ చిత్రం ఇలాంటి కలెక్షన్లు రాబట్టడం ఇదే తొలిసారి అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Hanuman Day 8 Box Office Collections Worldwide: Prashanth Neel movie Heading towards 200 crores

ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఓవర్సీస్‌లో సుమారుగా 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఇండియాలో 104 కోట్ల వసూళ్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 150 కోట్ల కలెక్షన్ల మైలురాయిని దాటింది. ఇక ఈ సినిమా త్వరలోనే 200 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X