Hanuman Day 9 Collections హనుమాన్ కలెక్షన్ల ఊచకోత.. రేర్ రికార్డుకు చేరువగా.. 9వ రోజు ఎన్ని కోట్లంటే?

హనుమాన్ చిత్రం రెండోవారంలో కూడా రికార్డు కలెక్షన్లు సాధిస్తున్నది. మీడియం బడ్జెట్ చిత్రంగా రిలీజైన ఈ సినిమా టాప్ హీరోల కలెక్షన్లను తలపించేలా వసూళ్లు రాబడుతున్నది. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్‌లో కే నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద తిరిగి చూసుకోలేదు. సంక్రాంతి బరిలో రిలీజైన చిత్రాలన్నింటిలోను సూపర్ విజేతగా నిలిచింది. ఈ సినిమా 10 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

హనుమాన్ సినిమా తొలి వారంలో ప్రేక్షకుల అభిమానాన్ని భారీగా సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సిినిమా ఆంధ్రా, నైజాంలో కలిపి 73 కోట్ల రూపాయలు, హిందీలో 25 కోట్ల రూపాయలు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి ఈ సినిమా 100 కోట్ల రూపాయలు నికరంగా సంపాదించింది. మీడియా బడ్జెట్ చిత్రాల్లో 100 కోట్లు సాధించిన చిత్రాల్లో ముందు వరుసలో నిలిచింది.

Hanuman Day 9 Box Office Collections Worldwide: Prashanth Varma Movie inching to 200 Crores

హనుమాన్ తొలివారం కంటే రెండోవారంలో బాక్సాఫీస్ జోరును కొనసాగిస్తున్నది. ఈ సినిమా తొమ్మితో రోజున ఇండియాలోనే 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగులో 10.5 కోట్ల రూపాయలు, హిందీలో 3.75 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 114 కోట్ల రూపాయలు నికరంగా , 131 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.

హనుమాన్ సినిమా ఓవర్సీస్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్నది. ఉత్తర అమెరికాలో అంటే అమెరికా, కెనడాలో కలిపి 4 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఓవర్సీస్ మొత్తంగా అంటే.. యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, సింగపూర్, యూఏఈ, గల్ఫ్ దేశాల్లో కలిపి టోటల్‌గా 5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 42 కోట్ల రూపాయలను రాబట్టింది.

Hanuman Day 9 Box Office Collections Worldwide: Prashanth Varma Movie inching to 200 Crores

ఇక ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం తెలుగులో 73 కోట్ల రూపాయలు, ఇండియా వ్యాప్తంగా 114 కోట్లు నికరంగా 130 కోట్ల గ్రాస్ వసూళ్లు, ఓవర్సీస్‌లో 42 కోట్ల రూపాయలు కలిపితే ఈ సినిమా 172 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా 200 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది.

Hanuman Day 9 Box Office Collections Worldwide: Prashanth Varma Movie inching to 200 Crores

హనుమాన్ సినిమా 50 కోట్ల బడ్జెట్‌తో 28 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా ప్రస్తుతం 100 కోట్లకుపైగా షేర్ కలెక్షన్లను సాధించింది. దాంతో ఈ సినిమా భారీ లాభాలతో ముందుకెళ్తున్నది. హనుమాన్ టికెట్‌పై 5 రూపాయలు అయోధ్య రామమందిరానికి చెల్లిస్తానని నిర్మాత చెప్పిన ప్రకారం. 2 కోట్లకుపైగా రూపాయలను అందజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X