HanuMan Box Office Collections అంచనాలు తలకిందులు చేసిన హనుమాన్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్ర హనుమాన్. ఈ చిత్రంలో వినయ్ రాయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, గెటప్ శ్రీను, సత్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా జనవరి 12 తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, ప్రీరిలీజ్ బిజినెస్,రోజు ఈ మూవీ ఎంత కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
Recommended Video

హనుమాన్ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ చిత్రంగా రూపొందించాలనే ఆలోచనతో నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ ఆ సినిమా ఓ దశలో భారీ బడ్జెట్ ప్రాజెక్టుగా మారడంతో భారీజడ్జెట్ చిత్రంగా రూపొందింది. దాంతో ఈ సినిమాకు మొత్తంగా వీఎఫ్ఎక్స్, షూటింగ్ ఖర్చులు, యాక్టర్ రెమ్యునరేషన్లతో కలిపి 60 కోట్ల రూపాయలుగా బడ్జెట్ అయింది.

ఇక హనుమాన్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు చేరువ కావడంతో బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా బిజినెస్ కూడా అందుకు తగినట్టుగానే అయింది. నైజాం థియేట్రికల్ రైట్స్‌ను 7.5 కోట్లు, సీడెడ్ 4 కోట్లు, ఆంధ్రా 10 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో తెలుగు రాష్ట్రాల హక్కులు మొత్తంగా 21.5 కోట్ల మేర అమ్మడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా28 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.
ఇదిలా ఉండగా, హనుమాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే.. తొలి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. హైదరాబాద్‌లో ప్రీమియర్ల ద్వారా 1 కోటి రూపాయలు వసూలు చేసింది.

ఇక తెలుగు రాష్రాల్లో హనుమాన్ సినిమాకు భారీగా ఆక్యుపెన్సీ నమోదైంది. మార్నిం్ షోకు 57 శాత, ఆఫ్టర్ మ్యాట్నీకి 77 శాతం, ఫస్ట్ షోకు 654 శాతం, సెకండ్ షోకు 68 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. హిందీలో ఈ సినిమాకు తొలి రోజున పెద్దగా హిందీలో తేలికపాటి అక్యుపెన్సీని సాధించింది.

హనుమాన్ ప్రీమియర్స్, తొలి రోజు కలెక్షన్లు
హనుమాన్ చిత్రం నైజాం, ఆంధ్రాలో పరిమితమైన స్క్రీన్లలో రిలీజైనప్పటికీ భారీ కలెక్షన్లు సాధించింది. 11వ తేదీన ప్రదర్శించిన ప్రీమియర్లకు సుమారుగా 4.20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మొదటి రోజు 9 కోట్లకుపైగా షేర్ సాధించింది. తెలుగులో 5 కోట్లు, హిందీలో 2.6 కోట్లు, తమిళంలో 30 లక్షలు, కన్నడలో 80 లక్షలు, మలయాళంలో 10 లక్షల రూపాయల షేర్ సాధించింది. దాంతో ఇండియాలో 9 కోట్ల రూపాయల షేర్, 16 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దాంతో ప్రీమియర్లతో కలిపి 13 కోట్ల షేర్ వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్‌లో 7 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 21 కోట్లు వసూలు చేసింది.
హనుమాన్ రెండో రోజు కలెక్షన్లు
ఇక రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. రిలీజ్ తర్వాత తొలి శనివారం రోజున కూడా భారీగానే కలెక్షన్లు రాబట్టింది. రెండో రోజు ఇండియా వైడ్ 8 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 20 కోట్ల షేర్, 30 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
HanuMan 3rd Day Collections
హనుమాన్ సినిమా మూడో రోజు స్టడీగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబడుతున్నది. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా 11 కోట్ల మేర కలెక్షన్లు సాధిస్తుంది. కన్నడ, ఇతర రాష్ట్రాల్లో కలిపి 14 కోట్లు వసూలు చేస్తుంది. హిందీలో ఈ సినిమా 4 కోట్ల రూపాయలు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా మూడు రోజుల్లో ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్‌తో కలిపి 20 కోట్ల మేర వసూళ్లను సాధిస్తుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











