HanuMan 31 Days Collections: హిందీలో హనుమాన్ సంచలనం.. మొత్తం అన్ని వందల కోట్లు.. లాభాలతో మరో రికార్డు

ఈ మధ్య కాలంలో తెలుగులో ఎన్నో ప్రయోగాత్మకమైన సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మెప్పును పొంది సక్సెస్ అయ్యాయి. అలాంటి వాటిలో రియల్ సూపర్ హీరో ఆంజనేయుడి నేపథ్యంతో వచ్చిన 'హనుమాన్' ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండానే వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల స్పందన భారీగా లభించింది. దీంతో ఇది అదిరిపోయే వసూళ్లను రాబడుతూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ హిందీలో రికార్డు సాధించింది. మరి 'హనుమాన్' మూవీ 31 రోజుల వసూళ్లను మీరే చూసేయండి మరి!

హనుమాన్‌గా తేజ ఎంటర్
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సూపర్ హీరో సినిమానే 'హనుమాన్'. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు.

HanuMan Movie 31 Days Worldwide Official Collections.. Crosses 50 Crore Net In Hindi

హనుమాన్ బిజినెస్ వివరాలు
'హనుమాన్' సినిమాకు నైజాంలో రూ. 7.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 9.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.65 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లు, వేరే భాషల్లో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.00 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా భారీగా రూ. 29.65 కోట్ల బిజినెస్‌ జరిగింది.

31వ రోజు తెలుగు వసూళ్లు
ప్రశాంత్ వర్మ - తేజ సజ్జా కలయికలో వచ్చిన 'హనుమాన్' చిత్రానికి ఆంధ్రా, తెలంగాణలో ఆరంభం నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా దీనికి కలెక్షన్లు పోటేత్తాయి. ఇలా నాలుగో వారం కూడా ఈ సినిమా మంచి స్పందనతో ముందుకు సాగిపోతోంది. అలా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 31వ రోజు రూ. 24 లక్షలు షేర్‌ను వసూలు చేసింది.

31 రోజులకూ కలిపి ఎంత?
31 రోజుల్లో 'హనుమాన్'కు ఆంధ్రా, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 39.02 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.56 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 11.98 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 8.05 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.19 కోట్లు, గుంటూరులో రూ. 6.33 కోట్లు, కృష్ణాలో రూ. 4.62 కోట్లు, నెల్లూరులో రూ. 2.49 కోట్లతో కలిపి.. రూ. 89.24 కోట్లు షేర్, రూ. 147.95 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో 31 రోజుల్లోనే రూ. 89.24 కోట్లు కొల్లగొట్టిన 'హనుమాన్' సినిమా.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ఏరియాలో రూ. 12.35 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 25.10 కోట్లు (50 కోట్లు నెట్), ఓవర్సీస్‌లో రూ. 28 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 154.69 కోట్లు షేర్‌, రూ. 289.10 కోట్లు గ్రాస్ రాబట్టింది.

HanuMan Movie 31 Days Worldwide Official Collections.. Crosses 50 Crore Net In Hindi

టార్గెట్.. లాభం ఎంతంటే
సూపర్ హీరో కాన్సెప్టుతో వచ్చిన 'హనుమాన్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 29.65 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 30.50 కోట్లుగా నమోదైంది. ఇక, 31 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 154.69 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 124.19 కోట్లు లాభాలను కూడా అందుకుంది.

హిందీలో టాప్ 10 మూవీగా
'హనుమాన్' మూవీకి హిందీ బెల్టులో కూడా భారీ స్పందన వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం అక్కడ తాజాగా రూ. 50 కోట్లు నెట్ మార్కును దాటింది. తద్వారా డబ్బింగ్ చిత్రాల లిస్టులో టాప్ 10కు చేరింది. ఈ లిస్టులో 'బాహుబలి 2' రూ. 510.99 కోట్లతో టాప్‌లో ఉండగా.. తర్వాత కేజీఎఫ్ 2, RRR, రోబో 2.0, సలార్, సాహో, బాహుబలి 1, పుష్ప, కాంటారా మూవీలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X