HanuMan: పాన్ ఇండియా మూవీ రికార్డు బ్రేక్.. హనుమాన్ దెబ్బకు అన్ని కోట్లు ఔట్

విభిన్నమైన సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. సూపర్ హీరోస్‌తో యూనివర్శ్‌ను క్రియేట్ చేయాలని భావించిన అతడు.. తొలి ప్రయత్నంలో భాగంగా 'హనుమాన్' అనే సినిమాను చేశాడు. రియల్ సూపర్ హీరో హనుమంతుడి కథతో రూపొందిన ఈ చిత్రం అదిరిపోయే స్పందనను అందుకుంటూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 'హనుమాన్' మూవీ ఓ రికార్డును బ్రేక్ చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

సూపర్ హీరోగా తేజ సజ్జా:తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన రియల్ సూపర్ హీరో మూవీనే 'హనుమాన్'. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని సమకూర్చారు.

HanuMan Movie Breaks KGF Chapter 1 Movie Record in Hindi

అక్కడ కూడా భారీగానే:ఆంజనేయ స్వామి స్టోరీతో రూపొందిన 'హనుమాన్' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000లకు థియేటర్లకు పైగానే తీసుకు వచ్చారు. దీనికి పోటీ వల్ల తెలుగు రాష్ట్రాల్లో పెద్ద స్క్రీన్లు దక్కకున్నా.. హిందీలో మాత్రం 1500లకు పైగానే స్క్రీన్లలో ఇది వచ్చింది. ఆ తర్వాత వీటి సంఖ్య బాగా పెరిగింది.

భారీ వసూళ్లతో రికార్డ్‌లే:తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ కలయికలో తెరకెక్కిన 'హనుమాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఉత్తరాదిలో అయితే ఈ చిత్రం మొదటి రోజు నుంచే క్రమంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అయోధ్య కార్యక్రమం వల్ల ఈ చిత్రానికి మరింత ఆదరణ దక్కుతోంది.

HanuMan Movie Breaks KGF Chapter 1 Movie Record in Hindi

వారంలో అన్ని కోట్లతో:సూపర్ హీరో కాన్సెప్టుతో సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందిన 'హనుమాన్' మూవీ హిందీ వెర్షన్‌కు భారీ స్పందన దక్కుతూనే ఉంది. ఈ సినిమాకు అక్కడ రూ. 2.10 కోట్లు నెట్ వసూళ్లు వచ్చాయి. తర్వాత మాత్రం ఒక్కసారిగా ఇది పుంజుకుంది. ఇలా ఈ చిత్రం హిందీలో భారీ వసూళ్లను రాబట్టింది. తద్వారా వారం రోజుల్లోనే రూ. 23 కోట్లు వరకూ నెట్ వసూళ్లు కలెక్ట్ చేసింది.

కేజీఎఫ్ రికార్డు బద్దలు:'హనుమాన్' మూవీ నార్త్ ఇండియాలో మెరుగైన ప్రదర్శన చేస్తూ ఎన్నో ఘనతలను అందుకుంటోంది. ఈ క్రమంలోనే మొదటి వారంలో ఈ చిత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 1' రికార్డును బ్రేక్ చేసింది. ఆ సినిమా వారం రోజుల్లో రూ. 20 కోట్లు నెట్ వసూలు చేయగా.. 'హనుమాన్' ఆరు రోజుల్లోనే ఈ మార్క్ దాటేసింది. అలాగే, 'కాంతార' వసూళ్లను 4 రోజుల్లోనే బద్దలు కొట్టింది.

HanuMan Movie Breaks KGF Chapter 1 Movie Record in Hindi

50 కోట్ల వసూళ్ల దిశగా:రియల్ సూపర్ హీరో కథతో రూపొందిన 'హనుమాన్' మూవీకి తెలుగులో రికార్డు స్థాయి వసూళ్లు వస్తున్నాయి. అలాగే, హిందీలో కూడా ఇది వారంలోనే రూ. 23 కోట్లు రాబట్టింది. ఈ క్రమంలోనే జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిర కార్యక్రమం ఉంది. దీంతో ఇది ఇంకా పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. ఫలితంగా ఇది రూ. 50 కోట్ల మార్కును చేరే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X