HanuMan: మరో గొప్ప రికార్డు కొట్టిన హనుమాన్.. తేజ సజ్జా 150, మహేశ్ 5 మాత్రమే!
సూపర్ హీరోల కాన్సెప్టులతో వచ్చే సినిమాలు ఎక్కువగా హాలీవుడ్‌లోనే చూస్తుంటాం. వాటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన వస్తుంటుంది. అలాంటి చిత్రాలను ఇన్సిప్రేషన్‌గా తీసుకుని ఇండియాలో కూడా సూపర్ హీరోల మూవీలు రూపొందుతోన్నాయి.
అలా తెరకెక్కిన తెలుగు సినిమానే 'హనుమాన్'. రియల్ సూపర్ హీరో అయిన హనుమంతుడి నేపథ్యంతో ఇది వచ్చింది. దీంతో ఈ చిత్రానికి భారీ స్పందన లభించింది. ఫలితంగా ఈ మూవీ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా మరో ఘనతనూ అందుకుంది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!

హనుమాన్‌గా వచ్చిన తేజ: తేజ సజ్జా హీరోగా నటించిన రియల్ సూపర్ హీరో మూవీనే 'హనుమాన్'. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ ఇచ్చారు.

టాక్‌కు తగ్గట్లే రికార్డులతో: ఆంజనేయ స్వామి నేపథ్యంతో రూపొందిన 'హనుమాన్' మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ లభించింది. అందుకు అనుగుణంగానే ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ భారీగా వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసుకుంది.

వందల కోట్లు రాబట్టింది: ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జా నటించిన 'హనుమాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా స్పందన భారీగా దక్కడంతో కలెక్షన్లు కూడా అదే రీతిలో పోటెత్తాయి. దీంతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 155 కోట్లు షేర్‌తో పాటు 300 కోట్లు గ్రాస్ మార్కును చేరుకుంది. తద్వారా సంక్రాంతి సీజన్‌లో బెస్ట్ మూవీగా ఇది చరిత్రను సృష్టించింది.

యాభై రోజులు పూర్తి చేసి: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' చిత్రానికి పోటీగా సంక్రాంతి సీజన్‌లో విడుదలైన 'హనుమాన్' మూవీకి థియేటర్లు పెద్దగా లభించలేదు. దీంతో ఈ సినిమా పని అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా పుంజుకున్న ఈ చిత్రం.. తర్వాత థియేటర్లను పెంచుకుంది. ఇలా శుక్రవారంతో యాభై రోజులు రన్ పూర్తి చేసుకుంది.

150 థియేటర్లతో రికార్డు: అంచనాలను నిజం చేస్తూ ఘన విజయాన్ని అందుకున్న 'హనుమాన్' మూవీ శుక్రవారంతో యాభైవ రోజును పూర్తి చేసుకుంది. అంతేకాదు, ఈ సినిమా ఇప్పటికీ మంచి స్పందనను దక్కించుకుంటోంది. ఈ క్రమంలోనే ఇది ఏకంగా 150 థియేటర్లలో యాభై రోజులు జరుపుకుంది. తద్వారా ఈ మధ్య కాలంలో ఎక్కువ థియేటర్లలో ఈ మార్క్ చేరిన చిత్రంగా రికార్డు సాధించింది.

మహేశ్ బాబు 5 మాత్రమే: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన 'హనుమాన్' మూవీ ఏకంగా 150 థియేటర్లలో యాభై రోజుల ప్రదర్శనను జరుపుకుని సత్తా చాటింది. అదే రోజున విడుదలైన మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమా మాత్రం కేవలం 5 థియేటర్లలో మాత్రమే అర్ధ శతదినోత్సవం జరుపుకుంది. దీంతో ఇప్పుడిది టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











