Hanuman 90 ఏళ్ల చరిత్రను తిరగరాసిన హనుమాన్..ఆ టాప్ హీరోల రికార్డుల ఫట్..ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

హనుమాన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ భారీ వసూళ్లను సాధిస్తున్నది. యువ హీరో తేజా సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో విడుదలైన ప్రతీ చోట ఈ మూవీ భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. పరిమితమైన స్క్రీన్లతో రిలీజైన ఈ చిత్రం అన్ని చోట్ల భారీగా స్క్రీన్లను పెంచుకొంటూ వెళ్తున్నది. కే నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన చిత్రం తెలుగు సినిమా రికార్డులను అధిగమించే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది. ఈ సినిమా 4 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Recommended Video

Hanuman టాప్ హీరోల Records ఫట్..కెనడా ,అమెరికా లో | Hanuman Boxoffice | Telugu Filmibeat

ఓవర్సీస్‌లో హనుమాన్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా ఉత్తర అమెరికా అంటే కెనడా, అమెరికాలో రికార్డు వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం నాలుగో రోజు 3 మిలియన్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 30 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. బాహుబలి సిరీస్, RRR లాంటి రాజమౌళి సినిమాలను మినహాయించి తెలుగు హీరోలందరి రికార్డులను తుడిచిపెట్టుకొంటూ వెళ్తున్నది.

HanuMan Movie Created Non Baahubali, RRR Collections in North America

ఉత్తర అమెరికాలో హనుమాన్ చిత్రం అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాల జాబితాలో చేరింది. బాహుబలి 2, RRR, సలార్, బాహుబలి, అల వైకుంఠపురంలో, రంగస్థలం, భరత్ అనే నేను, సాహో, ఆది పురుష్ చిత్రాల సరసన హనుమాన్ చేరింది. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్నీ రికార్డులు ఓవర్సీస్ మార్కెట్‌లో క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇక నైజాంలో హనుమాన్ సినిమా నాలుగో రోజే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 7.5 కోట్ల మేర అమ్ముడుపోగా, ఈ సినిమా నైజాంలో 8.85 కోట్ల రూపాయలు (జీఎస్టీ మినహాయించి) వసూలు చేసింది. ఈ సినిమా లాభాలతో ముందుకు వెళ్తూ సంచలనాలు సృష్టించేందుకు సిద్దమైంది.

HanuMan Movie Created Non Baahubali, RRR Collections in North America

ఇదిలా ఉండగా, హనుమాన్ చిత్రం గత 3 రోజుల్లో హిందీలో 12.5 కోట్లు, ఓవర్సీస్‌లో 24 కోట్ల రూపాయలు, తెలుగులో హనుమాన్ సినిమా ప్రీమియర్ల ద్వారా 4 కోట్లకుపైగా, తొలి రోజు ఏపీ, నైజాంలో 6 కోట్ల షేర్, రెండో రోజు 8.5 కోట్లు, మూడో రోజు 10 కోట్ల వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 24 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక 4వ రోజు 11 కోట్ల రూపాయల నికర వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది.

HanuMan Movie Created Non Baahubali, RRR Collections in North America

హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియా వైడ్‌గా 65 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 30 కోట్లు, హిందీలో 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం రానున్న రోజుల్లో 200 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X