HanuMan: చిరంజీవి రికార్డు బ్రేక్ చేసిన తేజ సజ్జా.. పవన్, ప్రభాస్ తర్వాత ఈ యంగ్ హీరోనే!
గతంలో కంటే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన కంటెంట్‌తో అదిరిపోయే సినిమాలు వస్తున్నాయి. అలాంటి వాటికే ప్రేక్షకులు మద్దతు తెలుపుతుండడంతో భారీ విజయాలను అందుకుంటున్నాయి. ఆ తరహాకు చెందిన సినిమానే 'హనుమాన్'. డిఫరెంట్ మూవీల డైరెక్టర్‌గా పేరున్న ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చి సంచలనం సృష్టించింది. అదే సమయంలో ఇది ఎన్నో రికార్డులను సైతం బ్రేక్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా 'హనుమాన్' మరో ఘనతను సొంతం చేసుకుంది. ఆ వివరాలను మీరే చూడండి!
హనుమాన్‌గా ఎంటరైన తేజ:తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రమే 'హనుమాన్'. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని అందించారు.

టాక్‌కు తగ్గట్లే భారీ వసూళ్లు:తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ లభించింది. అందుకు అనుగుణంగానే ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లోనూ అత్యధిక వసూళ్లు రాబట్టింది.
ఏకంగా అన్ని వందల కోట్లు:ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన 'హనుమాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా స్పందన భారీగా దక్కడంతో కలెక్షన్లు కూడా అదే రీతిలో పోటెత్తాయి. దీంతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 150 కోట్లు షేర్‌తో పాటు 300 కోట్లు గ్రాస్ మార్కును చేరుకుంది. తద్వారా సంక్రాంతి సీజన్‌లో బెస్ట్ మూవీగా ఇది రికార్డును నమోదు చేసింది.

హైదరాబాద్‌లో పెరిగాయి:'హనుమాన్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో తక్కువ థియేటర్లలోనే విడుదలైంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో దీనికి పెద్దగా థియేటర్లు లభించలేదు. అయితే, క్రమంగా ఈ చిత్రానికి రెస్పాన్స్ పెరగడంతో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా థియేటర్ల సంఖ్య పెరిగింది. కొద్ది రోజులకు 'గుంటూరు కారం' కంటే ఎక్కువ థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితం అయిపోయింది.
క్రాస్ రోడ్స్‌లో సంచలనం:నైజాం ఏరియాలో అత్యంత ముఖ్యమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70MM థియేటర్‌లో 'హనుమాన్' మూవీ ప్రదర్శితం అవుతోంది. అక్కడ ఈ మూవీ ఇప్పటి వరకూ ఏకంగా రూ. 1.02 కోట్లు షేర్‌ను వసూలు చేసి సత్తా చాటింది. ఈ క్రమంలోనే 'వాల్తేరు వీరయ్య' మూవీ పేరిట ఉన్న రూ. 1.01 రికార్డును ఇది బ్రేక్ చేసేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

టాప్‌లో ఉన్నది ఎవరంటే:సినిమా అడ్డాగా పేరొందిన ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సంధ్య 70MM థియేటర్‌లో ఎన్నో హిట్ చిత్రాలు పడ్డాయి. కానీ, అక్కడ కొన్ని మూవీలు మాత్రమే భారీ వసూళ్లు సాధించాయి. అందులో పవన్ కల్యాణ్ ఖుషీ ఫుల్ రన్‌లో రూ. 1.56 కోట్లు షేర్ రాబట్టింది. దీని తర్వాత తొలి ప్రేమ రూ. 1.17 కోట్లు, సలార్ రూ. 1.10 కోట్లతో టాప్ 3లో ఉన్నాయి. ఆ తర్వాత హనుమాన్ వచ్చి చేరింది.


Click it and Unblock the Notifications











