HanuMan Overseas Collections గుంటూరు కారం కలెక్షన్లను బ్రేక్ చేసి హనుమాన్.. ఓవర్సీస్‌లో కలెక్షన్ల కుండపోత!
సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజైన హనుమాన్ చిత్రం విడుదలైన ప్రతీ చోట బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. పండగ బరిలో అగ్ర హీరోల సినిమాలతో పోటీ పడుతూ చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రికార్డు కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ చిత్రం ప్రస్తుతం ఓవర్సీస్‌లో సంక్రాంతి సినిమాల కలెక్షన్లను అధిగమించి మరో రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఓవర్సీస్‌లో భారీగానే బిజినెస్ చేసింది. ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను 4 కోట్లు చెల్లించి సొంతం చేసుకొన్నారు. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా? అనే సందేహాలను వ్యక్తం చేసిన ట్రేడ్ అనలిస్టుల అంచనాలను బ్రేక్ చేసింది.

యూకే విషయానికి వస్తే.. హనుమాన్ సినిమా ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు 225K పౌండ్లను వసూలు చేసింది. తాజాగా ఆ సినిమా కలెక్షన్లను హనుమాన్ చిత్రం అధిగమించింది. హనుమాన్ చిత్రం 227K పౌండ్లను వసూలు చేసింది. ఆ తర్వాత సాహో సినిమా కలెక్షన్లపై గురిపెట్టింది.
ఇక అమెరికాలో హనుమాన్ సినిమా అరుదైన మైలురాయిని అధిగమించింది. ఈ సినిమా కెనడా, అమెరికాలో 3.7 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇండియన్ కరెన్సీలో ఈ మూవీ 31 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం సాధించిన 3.6 మిలియన్ డాలర్ల రికార్డును అధిగమించింది.
ఇదిలా ఉండగా, ఓవర్సీస్ మార్కెట్‌లో హనుమాన్ చిత్రం దూసుకెళ్తున్నది. ఈ చిత్రం 4 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. 33 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఓవర్సీస్‌లో గుంటూరు కారం సినిమా కలెక్షన్లను అధిగమించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
హనుమాన్ సినిమా 4.1 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా 33 కోట్ల రూపాయలు కలెక్షన్లు వసూలు చేసింది. ఇప్పటికే భారీ లాభాలతో కొనసాగుతున్నది. ఈ సినిమా త్వరలోనే 50 కోట్ల మార్కును దాటే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











