HanuMan Overseas Collections అమెరికాలో హనుమాన్ కలెక్షన్ల సునామీ.. యూకే ఇతర దేశాల్లో వసూళ్లు ఎన్ని కోట్లంటే?
యువ హీరో తేజా సజ్జా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం హనుమాన్. అమృతా అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్, గెటప్ శ్రీను తదితరులు నటించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా సంక్రాంతి బరిలో అగ్ర నటులు, భారీ బడ్జెట్ చిత్రాలతో పోటీపడింది.
ప్రపంచవ్యాప్తంగా తక్కువ సీన్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుండటంతో స్క్రీన్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నాయి. అయితే ఓవర్సీస్‌లో ఈ మూవీ రికార్డు వసూళ్లను రాబడుతున్నది. పలుదేశాల్లో ఈ సినిమా వసూళ్ల వివరాలు, అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే..

హనుమాన్ సినిమాకు వీఎఫ్ఎక్స్ భారీగా వాడటంతో ఖర్చు కూడా ఎక్కువగానే అయింది. చిన్న తరహా చిత్రంగా ప్రారంభించిన ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాను తలపించేలా క్వాలిటీతో తెరకెక్కింది. ఈ సినిమాను సుమారుగా 30 కోట్ల రూపాయలతో ఫినిష్ చేశారు.
ఇక హనుమాన్ సినిమాను ఓవర్సీస్ రైట్స్‌ను 4 కోట్ల రూపాయలకు అమ్మడం జరిగింది. ఈ సినిమా సుమారుగా 5 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. దాంతో ఈ సినిమాను 500 స్క్రీన్లకుపైగా ఓవర్సీస్‌లో రిలీజ్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన రోజు నుంచి బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది.
హనుమాన్ మూవీకి ఓవర్సీస్‌లో భారీ వసూళ్లను సాధిస్తున్నది. కేవలం మూడు రోజుల్లోనే 3 రోజుల్లోనే ఈ సినిమా 3 మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లను అంటే.. సుమారుగా 26 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఉత్తర అమెరికాలో అంటే కెనడా, యూఎస్‌లో అత్యధికంగా అంటే 2.5 మిలియన్ డాలర్లు అంటే 21 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక యూకే, ఐర్లాండ్ దేశాల్లో కూడా హనుమాన్ సినిమా భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా ఈ దేశాల్లో 150000 పౌండ్స్ అంటే 1.56 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఆస్ట్రేలియాలో 255560 ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే 1.4 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అలాగే యూఏఈ, గల్ఫ్ దేశాల్లో 135K డాలర్లు అంటే.. 1.1 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మిగితా దేశాల్లో 70 లక్షల రూపాయలు సాధించింది.


Click it and Unblock the Notifications











