HANU-MAN: రికార్డు క్రియేట్ చేసిన తేజా సజ్జా.. రిలీజ్‌కు ముందే అన్ని కోట్లు
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలంతా పూర్తిగా తమ తమ పంథాను మార్చుకున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు మన సినిమాల స్థాయి భారీగా పెరిగిపోవడంతో పాటు మార్కెట్ కూడా గణీనయంగా వృద్ధి చెందింది. దీంతో వాళ్లంతా బడా చిత్రాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో ఎన్నో పాన్ ఇండియా రేంజ్ మూవీలు ప్రేక్షకుల ముందుకు వచ్చి విపరీతంగా అలరించాయి. ఈ క్రమంలోనే మరికొన్ని చిత్రాలు కూడా ప్రారంభం అయ్యాయి. ఇక, ఇప్పుడు మరో సినిమా భారీ స్థాయిలో రాబోతుంది. అదే క్రేజీ కాంబినేషన్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'హనుమాన్' మూవీ.
కెరీర్ ఆరంభం నుంచి విలక్షణ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మది దోచుకుంటూ.. దర్శకుడిగా ఎంతో మంచి పేరును సొంతం చేసుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పటికే 'అ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' వంటి విభిన్న తరహా ప్రయోగాత్మక సినిమాలను రూపొందించిన ఈ యంగ్ డైరెక్టర్.. పలు విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా 'హనుమాన్' అనే సినిమాను చేస్తున్నాడు. రియల్ సూపర్ హీరోగా పేరున్న హనుమంతుడి కథతో ఈ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీని నుంచి విడుదలైన మోషన్ పోస్టర్.. ఫస్ట్ లుక్ వీడియో ఈ చిత్రంపై అంచనాలను పెంచేశాయి.

'జాంబీ రెడ్డి' వంటి భారీ హిట్ తర్వాత ప్రశాంత్ వర్మ - తేజా సజ్జా కాంబోలో రాబోతున్న 'హనుమాన్' మూవీని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఆ వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, కరోనా సెకెండ్ వేవ్ వల్ల అది సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే రెగ్యూలర్ షూటింగ్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి వరుసగా షెడ్యూళ్లలను ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకూ షూటింగ్ పూర్తైనట్లు టాక్ వినిపిస్తోంది. ఎంతో గ్రాండ్‌గా మొదలైన ఈ మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'హనుమాన్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే అప్పుడే ఈ సినిమా హక్కుల కోసం పోటీ ఏర్పడింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయట. తాజా సమాచారం ప్రకారం.. హనుమాన్ మూవీ డిజిటల్, శాటిలైట్ హక్కులకు రూ. 11 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. అలాగే, ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 5 కోట్లకు అమ్ముడయ్యాయని తెలిసింది. ఇలా రిలీజ్‌కు ముందే తేజా సజ్జా తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్స్‌తో రికార్డును అందుకున్నాడు.
'హనుమాన్' మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











