Hanuman Total Collections: హనుమాన్ టోటల్ కలెక్షన్స్.. మిరాయ్‌తో తేజ సజ్జా ఆ రికార్డ్ బ్రేక్ చేస్తాడా?

బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తేజ సజ్జా. జాంబీ రెడ్డి, ఇష్క్, అద్భుతం చిత్రాలతో హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాడు ఈ కుర్రాడు. ఈ దశలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ చిత్రం తేజ సజ్జా కెరీర్‌ను మలుపు తిప్పింది. పాన్ ఇండియా స్థాయిలో వందల కోట్ల వసూళ్లతో కనక వర్షం కురిపించింది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో హనుమాన్ బడ్జెట్ ఎంత? ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ ఎంత? లాభమెంత? నష్టమెంత? ఈ వివరాల్లోకి వెళితే..

హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే. నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇందులో తేజ సజ్జా సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు కీలకపాత్రలు పోషించారు. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయగా.. గౌర హరి, అనుదీప్ దేవ్‌లు సంగీత దర్శకత్వం వహించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు భారీ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఖర్చులు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి హనుమాన్ చిత్రానికి రూ.50 కోట్ల బడ్జెట్ అయ్యింది.

Hanuman Movie Total Collections Worldwide Prasanth Varma Teja Sajja s Movie Budget Overal Collection and Target for Mirai

హనుమాన్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో హనుమాన్ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దీంతో తేజ సజ్జా మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. నైజాంలో 7.5 కోట్లు, సీడెడ్‌లో 5 కోట్లు, ఆంధ్రాలో 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. కర్ణాటక హక్కులు 2 కోట్లు, ఓవర్సీస్ బిజినెస్ 4 కోట్ల రూపాయల మేర జరిగింది. మొత్తంగా హనుమాన్‌కు వరల్డ్ వైడ్‌గా 28 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 30 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 60 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు విలువ నిర్దేశించాయి.

హనుమాన్ కలెక్షన్స్
హనుమాన్ చిత్రం థియేట్రికల్ రన్ ముగిసేసరికి వరల్డ్ వైడ్‌గా 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ మూవీకి కర్ణాటకలో 23 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 150 కోట్ల రూపాయలు, తమిళంలో 4 కోట్లు, మలయాళంలో కోటి రూపాయలు, హిందీలో 60 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 60 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. ఊహించని వసూళ్లతో హనుమాన్ చరిత్ర సృష్టించింది. 30 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్‌కు గాను ఏకంగా 160 కోట్ల షేర్ రాబట్టి.. 130 కోట్లకు పైగా లాభాలను పంచి పెట్టింది. 60 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లకు గాను ఏకంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి ఆశ్చర్య పరిచింది.

మిరాయ్ ఎదుట భారీ టార్గెట్
హనుమాన్ తర్వాత తేజ సజ్జ నటిస్తోన్న సినిమా కావడంతో మిరాయ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. పాపులర్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. మంచు మనోజ్, శ్రీయ సరన్‌లు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 12వ తేదీన పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మిరాయ్ రిలీజ్ అవుతున్నది. నటీనటుల రెమ్యునరేషన్లు, ప్రచార ఖర్చులతో కలిపి మిరాయ్‌కి 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారీ అంచనాల నేపథ్యంలో తేజ సజ్జా మూవీకి థియేట్రికల్, శాటిలైల్, ఓటీటీ, ఆడియోతో కలిపి దాదాపు 85 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ఫిలింనగర్ టాక్.

అంచనాలకు తగిన విధంగానే మిరాయ్ అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మురేపుతోంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్‌కు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటికే 2 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో 1.70 కోట్ల రూపాయలు) రాబట్టి హనుమాన్ రికార్డుల్ని దాటేసింది. అటు తెలుగు రాష్ట్రాలు, హిందీలోనూ అడ్వాన్స్ బుకింగ్‌లో మిరాయ్ బీభత్సం సృష్టిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో హనుమాన్ కలెక్షన్స్ రికార్డుల్ని తేజ సజ్జా బద్దలు కొడతాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X