HanuMan Business హనుమాన్‌కు రికార్డు బిజినెస్.. ఎన్ని కోట్లు వసూలు చేస్తే లాభాల్లోకి అంటే?
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించిన పాన్ ఇండియా మూవీ హనుమాన్. తేజా సజ్జా, అమృతా అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ భాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య తదితరులు నటించిన ఈ చిత్రం జనవరి 12వ తేదీన పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. శ్రీమతి చైతన్య సమర్పించిన ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాల్లోకి వెళితే..
Recommended Video

హనుమాన్ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపానీష్ భాషల్లో రూపొందించారు. ఈ సినిమా కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టగా.. మరో 5 కోట్ల రూపాయలు ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం కేటాయించారు. దాంతో ఈ సినిమా 50 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించారు. టీజర్, ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు భారీ బజ్ క్రియేట్ అయింది.

హనుమాన్ మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలకు మంచి రెస్సాన్స్ రావడం ట్రేడ్ వర్గాలను ఆకర్షించేలా చేసింది. దాంతో డిజిటల్, శాటిలైట్ బిజినెస్‌కు భారీ స్పందన వచ్చింది. దాంతో ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ 30 కోట్లగా నమోదైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా బడ్జెట్‌లో 50 శాతం రికవరీని సాధించినట్లయింది.
హనుమాన్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రీబ్యూట్ చేస్తున్నది. ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం థియేట్రికల్ రైట్స్‌ను 7.5 కోట్లు, సీడెడ్ 4 కోట్లు, ఆంధ్రా 10 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో తెలుగు రాష్ట్రాల హక్కులు మొత్తంగా 21.5 కోట్ల మేర అమ్మడం జరిగింది.

ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా హక్కులు 2 కోట్ల మేర అమ్ముడుపోయాయి. అలాగే ఓవర్సీస్ రైట్స్ కూడా భారీగా అంటే.. 4 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దాంతో హనుమాన్ సినిమా 27.5 కోట్లుగా నమోదైంది. ఇక ఈ సినిమాకు 28.5 కోట్లు బ్రేక్ ఈవెన్‌గా మారింది.

పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న హనుమాన్‌కు బాక్సాఫీస్ టార్గెట్ పెద్దగా కనిపించడం లేదు. మూవీకి పాజిటివ్ టాక్ వస్తే.. లాభాల్లోకి రావడం అంత కష్టం కాదు అనే మాట వినిపిస్తున్నది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీగా స్పందన వస్తున్నది. సంక్రాంతి రేసులో హిట్‌గా నిలిచే సినిమా అనే టాక్ కూడా వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











