Double Ismart: ఫ్యాన్సీ రేటుకు డబుల్ ఇస్మార్ట్.. హనుమాన్ నిర్మాతకు థియేట్రికల్ హక్కులు

ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ చిత్రం రిలీజ్‌కు ముందే భారీ క్రేజ్‌ను సొంతం చేసుకొంటున్నది. పూరీ కనెక్ట్ బ్యానర్‌పై చార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, కావ్య థాపర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకొన్నాయి. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా భారీగా బిజినెస్ చేయడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఇస్మార్ట్ శంకర్ భారీ విజయం అందుకోవడంతో డబుల్ ఇస్మార్ట్ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలకు తగినట్టే ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకొన్నాయి. ఇటీవల రిలీజైన పాటలు రీసౌండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాపై బజ్ క్రియేట్ అవుతున్నది.మణి శర్మ అందించిన పాటలకు మంచి స్పందన లభిస్తున్నది.

Hanuman Producer Niranjan Reddy s Prime Show acquired Double Ismart Theatrical Rights

డబుల్ ఇస్మార్ట్ సినిమా థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరగడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా హక్కులను హనుమాన్, ప్రస్తుతం డార్లింగ్ సినిమాను నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ దక్కించుకొన్నది. హిందీ వెర్షన్,ఉత్తర భారతం హక్కులు తప్పా మిగితా ప్రాంతాలన్నీ అంటే..ఇతర భాషలతోపాటు ఓవర్సీస్ హక్కులను కూడా దక్కించుకోవడం విశేషంగామారింది.

డబుల్ ఇస్మార్ట్ సినిమా నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ ప్రాతిపాదికన సుమారుగా 60 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. అంటే 60 కోట్ల రూపాయలు రికవరీ అయిన తర్వాత ఈ సినిమాపై వచ్చే రెవెన్యూలో 20 శాతం కమిషన్‌ను ప్రైమ్ షో అందుకొంటుంది. ఈ ఒప్పందం ప్రకారం బిజినెస్ జరగడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.

శ్యామ్ కే నాయుడు, గియానీ గిన్నెలీ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవుతున్నది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. హనుమాన్ సినిమా తర్వాత ఈ సినిమాను భారీగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ప్రైమ్ షో రికార్డు క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X