Hanuman3D Box Office: హనుమాన్ 3డీ కలెక్షన్స్.. రీ రిలీజ్‌లో తేజా సజ్జా మూవీకి ఎంతంటే?
ఇటీవలి కాలంలో సినిమాల రీ రిలీజ్‌ల్ ట్రెండ్ బాగా సాగుతోంది. పాత హిట్ సినిమాలను నేటి తరానికి అనుగుణంగా ఆధునిక హంగులతో తీర్చిదిద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. త్రీడీలో, 4కే వెర్షన్‌లో వస్తోన్న ఈ పాత సినిమాలు మంచి వసూళ్లను రాబడుతూ రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజాగా రెండేళ్ల క్రితం పాన్ ఇండియా లెవల్‌ల్ సంచలనం సృష్టించిన హనుమాన్ మూవీని 3డీ వెర్షన్‌లో జూన్ 25న రీ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో తేజ సజ్జా- ప్రశాంత్ వర్మల చిత్రం ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
హనుమాన్ తారాగణం
ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి ఈ హనుమాన్ మూవీని నిర్మించగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషించారు. సముద్రఖని, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, సత్య, గెటప్ శ్రీను తదితరులు నటించారు. మాస్ మహారాజా రవితేజ ఒక కోతి పాత్రకు వాయిస్ ఓవర్ అందించి అలరించారు. దాశరధి సివేంద్ర సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. గౌర హరి, అనుదీప్ దీవ్ సంగీత దర్శకత్వం వహించారు. తలారి సాయిబాబు ఎడిటర్‌గా పనిచేశారు.

హనుమాన్ ప్రీ రిలీజ్ బిజినెస్
హనుమాన్ మూవీ థియేట్రికల్ బిజినెస్ చూస్తే నైజాంలో 7.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 5 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 10 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 22.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 4 కోట్ల రూపాయలు, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 2 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 28 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది. హనుమాన్ మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే 30 కోట్ల రూపాయల షేర్.. 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
హనుమాన్ కలెక్షన్స్
సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న హనుమాన్ మూవీ విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ దక్కించుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. తెలుగు రాష్ట్రాలతో సమానంగా హిందీ బెల్ట్‌లో దుమ్మురేపింది. ఇండియాలో హనుమాన్ మూవీ 202 కోట్ల రూపాయలు నెట్.. 238.29 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా.. ఓవర్సీస్‌లో 57 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 300 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నైజాంలో 66 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 55.6 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 18.5 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 140 కోట్ల రూపాయలు రాబట్టి భారీ లాభాలను అందించింది.
హనుమాన్ 3డీ రీ రిలీజ్ కలెక్షన్స్
పెద్ది, మా ఇంటి బంగారం వంటి సినిమాలు థియేటర్‌లో ఉండటం, వర్కింగ్ డేస్ కావడంతో హనుమాన్ 3డీకి ప్రేక్షకుల నుంచి ఓ మాదిరిగా స్పందన లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఏరియాలలోనే హనుమాన్ 3డీ అందుబాటులో ఉండటం కూడా ప్రభావం చూపింది. తొలిరోజున 17.13 లక్షల రూపాయలు రాబట్టిన తేజ సజ్జా మూవీ రెండో రోజున 30 శాతం డ్రాప్‌తో 12.20 లక్షల రూపాయలు చొప్పున రెండ్రోజుల్లో 29.33 లక్షల షేర్ రాబట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో 18.95 లక్షల రూపాయలు, తెలంగాణలో 10.25 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 13 వేల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. మరి శని, ఆదివారాలలో హనుమాన్ ఎంత రాబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications


