Happy 5 days Box Office: పెద్ది కలెక్షన్లను అధిగమించిన హ్యాపీ.. కేరళలో అల్లు అర్జున్ మూవీకి వసూళ్లు ఎంతంటే?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన హ్యాపీ చిత్రం లేటేస్ట్ టెక్నాలజీ హంగులతో కేరళ వ్యాప్తంగా రీరీలీజ్ అయిది. ప్రముఖ దర్శకుడు ఏ కరుణాకరన్ దర్శకత్వంలో హ్యాపీ చిత్రం తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన జెనీలియా హీరోయిన్‌గా నటించారు. మనోజ్ బాజ్‌పేయ్, కిశోర్, దీపక్ శిర్కే, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, సీత, రమాప్రభ, సుమన్ శెట్టి, ఎంఎస్ నారాయణ, వేణు మాధవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రాధా మోహన్ కథను అందించగా.. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.. ఆంటోనీ ఎడిటర్‌గా సేవలందించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం లైఫ్ టైమ్ కలెక్షన్లు ఎంత? మలయాళంలో హ్యాపీ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

హ్యాపీ చిత్రాన్ని అప్పట్లో భారీగా నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్‌తో కలిపి దాదాపు 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. 27 జనవరి 2006న హ్యాపీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరుణాకరన్ టేకింగ్, అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అప్పట్లో కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. ట్రేడ్ వర్గాలను నిరాశపరుస్తూ దాదాపు 17 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతారు.

Happy 4K 5 days Re Release Box Office

ఇక సినిమాను 4K టెక్నాలజీలోకి కన్వర్ట్ చేశారు. సౌండ్, కలర్ గ్రేడింగ్ చేశారు. దాంతో సుమారుగా కోటి రూపాయలుపైగా ఖర్చు పెట్టి కొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేరళలో ఈ సినిమా రీ రీలీజ్ సందర్భంగా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా మంచి రెస్సాన్స్ వచ్చింది. ప్రీమియర్లకు యువత హోరెత్తించారు అనే విషయం సోషల్ మీడియాలో జోష్ చూస్తే కనిపించింది. ఈ చిత్రం జూన్ 11వ తేదీన 4 లక్షల రూపాయల మేర వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక జూన్ 12వ తేదీన తొలి రోజు ఈ సినిమాకు 25 లక్షల రేంజ్‌లో భారీ కలెక్షన్లు నమోదు అయ్యాయి. రెండో రోజు ఈ సినిమా మరో 25 లక్షలు వసూలు చేసింది. మూడో రోజు అదే జోష్‌ను కొనసాగిస్తూ 31 లక్షల రూపాయలు రాబట్టింది. నాలుగో రోజు జూన్ 15వ తేదీన 14 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం ఐదో రోజు మంగళవారం కూడా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నది. ఈ చిత్రం సుమారుగా 10 లక్షల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా 1.05 కోటి రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇటీవల రిలీజైన రాంచరణ్ మూవీ పెద్ది సినిమాను మించి కలెక్షన్లు సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. పెద్ది చిత్రం కేరలో ఇప్పటి వరకు 72 లక్షల రూపాయలు వసూలు చేసింది. రెగ్యులర్ రిలీజైన పెద్ది కంటే అల్లు అర్జున్ హ్యాపీ మూవీ ఎక్కువగా వసూళ్లను సాధించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ చిత్రం ఇదే ఊపు కొనసాగితే.. బాహుబలి ది ఎపిక్ కలెక్షన్లను కూడా అధిగమించే ప్రమాదం కనిపిస్తున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X