Happy Birth Day Prabhas: బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్ హ్యాపీ బర్త్ డే.. డార్లింగ్ రెబల్ స్టార్ కలెక్షన్ల లెక్క
రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు, భారతీయ అభిమానులను మంచి పలు దేశాల్లో విశేషంగా ఫ్యాన్స్ ఉన్నారు. బాహుబలి మూవీ ఆయన ఇమేజ్‌ను మార్చేసి గణనీయంగా ఫాలోవర్స్‌ను పెంచేసింది. తాజాగా వచ్చిన కల్కి 2898 AD సినిమాతో ఆయన రేంజ్ సరిహద్దులు దాటింది. ఇలాంటి తరుణంలో ప్రభాస్ తన 45వ పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల్లోకి వెళితే..
ప్రభాస్ కెరీర్ బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అనే విధంగా చెప్పుకొనేలా ఉంది. బాహుబలి సినిమాకు ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిర్చి, మిస్టర్ ఫర్‌ఫెక్ట్, భిల్లా లాంటి సినిమాలతో విజయాలు అందుకొన్నారు. అయితే బాహుబలి సినిమా ఆయన కెరీర్‌ను పూర్తిగా మార్చి వేసింది. ఆయనను పాన్ ఇండియా ఆడియెన్స్‌ను అభిమానులనే కాకుండా భక్తులుగా మార్చేసింది.

బాహుబలి సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద రారాజుగా మారిపోయారు. టాలీవుడ్ స్టార్ హీరో స్థాయి నుంచి ఇండియన్ సూపర్ స్టార్‌గా మార్చి వేసింది. ఆయన నటించిన చిత్రాలు హిందీ మార్కెట్‌లో రికార్డు వసూళ్లను సాధించాయి. ఆయన నటించిన సినిమాలు హిట్టు కొట్టకపోయినా సంచలన రీతిలో కలెక్షన్లు రాబట్టాయి.
ఇక బాహుబలి సినిమా విషయానికి వస్తే.. ఇండియన్ సినిమా రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏదైనా సినిమా రికార్డు సాధిస్తే ఇప్పటికీ బాహుబలి.. నాన్ బాహుబలి రికార్డు అనే మైలు రాయిని సెట్ చేశాడు. బాహుబలి చిత్రం సుమారుగా 1800 కోట్ల రూపాయలు రాబట్టింది.
ఇక రెబల్ స్టార్ నటించిన సాలర్ చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో భారీ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం సుమారుగా 610 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇటీవల రిలీజైన కల్కి 2898 AD 938 కోట్లు రాబట్టింది. ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్‌కు అడ్డగా మారిపోయాయి.

ఇవియే కాకుండా బాహుబలి 515 కోట్ల రూపాయలు, సాహో 450 కోట్ల రూపాలయలు, ఆదిపురుష్ 412 కోట్ల రూపాయలు, రాధే శ్యామ్ 200 కోట్ల రూపాయలు వసూళ్లు సాదించాయి. ప్రభాస్ సినిమా హిట్టు, ఫ్లాప్ అనే తేడా లేకుండా కలెక్షన్లు సాధించడం ఓ రికార్డుగా చెప్పుకొంటారు. ప్రస్తుతం ఆయన నటించే చిత్రాలు రాజాసాబ్, సలార్ 2, కల్కి 2 సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన బాక్సాఫీస్ బాహుబలిగా ఉండాలని ఫిల్మీబీట్ బర్త్ డే విషెస్ అందజేస్తున్నది.


Click it and Unblock the Notifications











