Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
HBD Allu Arjun: ‘అల’ క్లోజింగ్ కలెక్షన్లు.. బాక్సాఫీస్‌ను రఫ్ ఆడించిన స్టైలిష్ స్టార్
టాలీవుడ్‌కు భారీ లాభాలు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఒకటి అల వైకుంఠపురంలో.. ఈ చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధికంగా వసూళ్లను సాధించింది. అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో బాహుబలి తర్వాత రెండోస్థానంలో నిలిచింది. సంక్రాంతి బరిలో రిలీజైన ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా వసూళ్ల వివరాలు మీ కోసం..
ప్రీ రిలీజ్ బిజినెస్
ఏపీ, తెలంగాణలో అల వైకుంఠపురంలో మూవీ రూ.65 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నైజాంలో రూ.19 కోట్లు, సీడెడ్‌లో రూ.12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.8.5 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.6.30 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.5 కోట్లు, గుంటూరులో రూ.6.3 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.5 కోట్లు, నెల్లూరులో రూ.2.78 కోట్ల బిజినెస్ చేసింది. దాంతో ఏపీ, తెలంగాణలో రూ.65 కోట్లకుపైగా బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటకలో రూ.7.2 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.1.4 కోట్లు, ఓవర్సీస్లో రూ.9.8 కోట్ల మేర జరిగింది.
నైజాం, ఓవర్సీస్ కలెక్షన్లు
అల వైకుంఠపురంలో క్లోజింగ్ కలెక్షన్లు చూస్తే.. నైజాం, తెలంగాణలో కలిపి రూ.128.68 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం నైజంలో రూ.44.3 కోట్లు, కర్ణాటక రూ.9.18 కోట్లు, కేరళలో రూ.1.17 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.1.44 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్లో రూ.18.33 కోట్లు కలెక్ట్ చేసింది.
ఆంధ్రా, సీడెడ్‌లో వసూళ్లు
ఇక ఏపీ విషయానికి వస్తే.. సీడెడ్‌లో రూ.18.13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.11.31 కోట్లు, పశ్చిమ బెంగాల్లో రూు.8.85 కోట్లు, గుంటూరు రూ.11.05 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.10.67 కోట్లు, నెల్లూరులో రూ.4.66 కోట్లు రాబట్టింది. దీంతో డిస్టిబ్యూటర్లు భారీ లాభాలను సొంతం చేసుకొన్నారు.
Recommended Video
253 కోట్ల గ్రాస్ వసూళ్లు
అల వైకుంఠపురంలో చిత్రం సుమారు రూ.85 కోట్ల సాధించే టార్గెట్‌తో రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రం అందరి అంచనాలను బ్రేక్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా రూ.253.85 కోట్ల గ్రాస్, రూ.158.80 కోట్ల నికర లాభాలను సొంతం చేసుకొన్నది. ఇది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యుత్తమ వసూళ్ల రికార్డుగా నిలిచింది.