For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HBD koratala siva: మోసం చేసిన దర్శకుడి కంటే ధీటుగా.. ప్రతి సినిమా బాక్సాఫీస్ హిట్టే, టోటల్ కలెక్షన్స్

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు అపజయం లేని అతికొద్ది మంది టాప్ దర్శకుల్లో ఎస్ఎస్.రాజమౌళి ఉన్నాడు. ఇక ఆ తరువాత కొరటాల శివ కమర్షియల్ గా మంచి సినిమాలతో వరుస హిట్స్ అందుకుంటున్నాడు. ఇక నేడు ఆయన పుట్టినరోజు కావడంతో స్టార్ హీరోలు నిర్మాతలు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఇక కొరటాల శివ డైరెక్ట్ చేసిన నాలుగు సినిమాల కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

  మొదట రైటర్ గా

  మొదట రైటర్ గా

  కొరటాల శివ 2002నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాడు. మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన దగ్గరి బంధువైన పోసాని కృష్ణమురళి దగ్గర శిష్యరికం చేశారు. గర్ల్ ఫ్రెండ్, భద్ర, ఒక్కడున్నాడు, మున్నా , బృందావనం, సింహా ఊసరవెల్లి లాంటి విభిన్నమైన సినిమాలకు రైటర్ గా వర్క్ చేసి మంచి గుర్తింపు అందుకున్నాడు.

  స్టార్ డైరెక్టర్ మోసం

  స్టార్ డైరెక్టర్ మోసం

  రైటర్ గా కొరటక శివకు మంచి గుర్తింపు ఉన్న క్రమంలోనే ఒక సినిమా విషయంలో రైటర్ గా వర్క్ చేసినప్పటికీ ఆ గుర్తింపు దక్కలేదు. దర్శకుడి మోసం వలన ఆ ప్రాజెక్ట్ నుంచి కొరటాల కోపంతో బయటకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అనంతరం పోసాని కూడా కొరటాలకు అండగా ఉంటూ ఆ విషయంపై గట్టిగానే ఆరా తీశారు. అయినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా కొరటాల మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు.

  ప్రభాస్ మిర్చి కలెక్షన్స్

  ప్రభాస్ మిర్చి కలెక్షన్స్

  మిర్చి సినిమా కథ రొటీన్ అయినప్పటికీ కొరటాల శివ మేకింగ్ తోనే ప్రభాస్ ను నెవర్ బిఫోర్ అనేలా చూపించాడు. సినిమాలో డైలాగ్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కు మంచి క్రేజ్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద 80కోట్లకు పైగా వసూళ్లను అందుకొని అప్పట్లో ప్రభాస్ స్థాయిని ఆ సినిమా మరింత పెంచింది.

  శ్రీమంతుడు బాక్సాఫీస్ ట్రెండ్ సెట్టర్

  శ్రీమంతుడు బాక్సాఫీస్ ట్రెండ్ సెట్టర్

  ఇక 2015లో మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ కథను మొదట ఎన్టీఆర్ కు చెప్పినప్పటికీ బిజీగా ఉండడం వల్ల ఒప్పుకోలేదు. ఇక మహేష్ వరుస అపజయలతో సతమతమవుతున్న తరుణంలో శ్రీమంతుడు మూవీతో ఒక్కసారిగా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. 140కోట్లకు పైగా వసూళ్లను అందుకొని కొరటాలను స్టార్ డైరెక్టర్ ను చేసింది.

  జనతా గ్యారెజ్.. ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ హిట్

  జనతా గ్యారెజ్.. ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ హిట్

  ఇక మూడోసారి జూనియర్ ఎన్టీఆర్ తో వర్క్ చేసిన కొరటాల శివ జనతా గ్యారేజ్ సినిమాతో మరొక మంచి హిట్ అందుకున్నాడు. ఆ సినినా బాక్సాఫీస్ వద్ద 134కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఎన్టీఆర్ కెరీర్ లో కూడా ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. 'స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు' అని తారక్ ట్వీట్ చేశాడు.

  మహేష్ బాబుతో సెకండ్ హిట్

  మహేష్ బాబుతో సెకండ్ హిట్

  ఇక మహేష్ బాబుతో రెండవసారి వర్క్ చేసిన శివ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో భరత్ అనే నేను సినిమా చేశాడు. ఆ సినిమా కూడా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద 200కోట్లను టచ్ చేసినట్లు అప్పట్లో ప్రచారాలు బాగానే చేశారు. మొత్తానికి కొరటాల శివ అయితే వరుసగా నాలుగు బాక్సాఫీస్ హిట్స్ తో గట్టిగానే నిలదొక్కుకున్నాడు.

  Koratala Siva సాప్ట్ వేర్ జాబ్ వదిలేసి.. Acharya కోసం సెంటిమెంట్ క్విట్ || Filmibeat Telugu
  ఆచార్యతో మరో హిట్ గ్యారెంటీ

  ఆచార్యతో మరో హిట్ గ్యారెంటీ

  ఇక నెక్స్ట్ ఆచార్య సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈజీగా 200కోట్ల మార్క్ ను అందుకోగలదని చెప్పవచ్చు. అయితే దర్శకుడిగా కెరీర్ మొదట నుంచి కూడా దేవి శ్రీ ప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా సెట్ చేసుకున్న కొరటాల శివ చిరంజీవి కారణంగా మొదటిసారి మణిశర్మతో మ్యూజిక్ చేయించుకోవాల్సి వచ్చింది.

  English summary
  SS Rajamouli is one of the few top directors in the Tollywood film industry who has never failed. After that Koratala Siva is getting a series of hits with good movies as a commercial. Today is his birthday and Star Heroes producers and movie celebrities are offering birthday wishes. If you take a look at the collections of four films directed by Koratala Siva ..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X