ఇది తెలుగు సినీ నామ సంవత్సరం
తెలుగువారికి సంబంధించి 2006 సంవత్సరం సినీ నామ సంవత్సరమే అని చెప్పవచ్చు. వెంకటేష్ లక్ష్మి సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు పోకిరి సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగు సినిమా కలెక్షన్ల రేంజి పాతిక నుంచి 30 కోట్లకు మించదని అనుకునేవారు. కానీ పోకిరీ పాత రికార్డులను తిరగరాస్తోంది. ఈ సినిమా దాదాపు నలబై కోట్లు వసూలు చేయగలదని అంచనా. ఈ సినిమా ఇంత రేంజికి వెళ్తుందని మహేష్, పూరీ జగన్నాధ్ ఇద్దరూ ఊహించి ఉండరు. లారెన్స్ సినిమా స్టైల్ త్వరలో శతదినోత్సవం జరుపుకోబోతోంది. ఈ సినిమా గ్రామీణ ప్రాంతాల్లోనే కాక నగరాల్లో కూడా మంచి హిట్ అయింది. ఇక నాగార్జున శ్రీ రామదాసు కమర్షియల్ చిత్రం కాకపోయినా, సినిమాలోని భక్తి రసం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. ఈ సినిమాను హిందీలోకి డబ్ చేసే ఆలోచనలో నిర్మాత ఉన్నారు. శేఖర్ కమ్ముల గోదావరి కూడా ఈ వేసవిలొ విడుదలైన వాటిలో చెప్పుకోదగిన సినిమా. ఈ సినిమా కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications