ఫస్ట్ డే కలెక్షన్ 44 కోట్లు
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సినిమా విడుదల అవుతుందంటే రెన్సాన్స్ ఏ రేంజిలో ఉంటుందో, ఓపెనింగ్స్ ఎలా కేక పుట్టిస్తాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా విడుదలైన షారుక్ ‘హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం అంచనాలు ఏ మాత్రం తప్పలేదు. తొలిరోజు భారీ కలెక్షన్స్ సాధించిన సరికొత్త రికార్డు సృష్టించింది.
ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఈ చిత్రం రూ. 44 కోట్లు వసూలు చేసింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇది సరికొత్త రికార్డు. తెలుగు వెర్షన్ తొలి రోజు 2 కోట్లు వసూలు చేసింది. అదే విధంగా తమిళంలో 94 లక్షలు రాబట్టింది. తొలిరోజు కలెక్షన్లే ఈ రేంజిలో ఉన్నాయంటే ఈచిత్రం బిజినెస్ ఏ రేంజిలో ఉంటుందో చూడాలి.

షారుక్ ఖాన్, దీపికా పదుకొనె జంటగా నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్' చిత్రానికి ఫరా ఖాన్ దర్శకత్వం వహించారు. ‘మైహూనా', ‘ఓం శాంతి ఓం' తర్వాత షారుక్ ఖాన్ హీరోగా లేడీ డెరైక్టర్ ఫరా ఖాన్ రూపొందించిన మూడో చిత్రమిది. ఈ సినిమాను దీపావళి పండగ సందర్భంగా విడుదల చేసారు. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై షారుక్ భార్య గౌరీఖాన్ నిర్మించారు.


Click it and Unblock the Notifications











