Happy Raj Day 1 Collections: హ్యాపీరాజ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. జీవీ ప్రకాష్‌ మూవీ బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటీ?

సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగాను సక్సెస్ అయ్యారు. తాజాగా ఆయన హీరోగా నటించిన మూవీ హ్యాపీరాజ్. రాజా ఎలెంజెయన్ దర్శకత్వం వహించారు. బియోండ్ పిక్చర్స్ బ్యానర్‌పై జైవరదా నిర్మిస్తున్నారు. ప్రకాష్ సరసన శ్రీ గౌరిప్రియ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ నటుడు అబ్బాస్, జార్జ్ మరియన్, గీతా కైలాసం, అధిరిచి అరుణ్, మధురై ముత్తు తదితరులు కీలకపాత్రలు పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు సంగీత అందించారు.. సెల్వ ఆర్కే ఎడిటింగ్, మదన్ క్రిస్టోఫర్ సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీరామనవమి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో మార్చి 27న హ్యాపీరాజ్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు హ్యాపీరాజ్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

హ్యాపీరాజ్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి హ్యాపీరాజ్ మూవీ 12 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలు, స్టాండర్డ్స్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను నిర్మించారు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలో హ్యాపీరాజ్ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది.

Happy Raj Day 1 Expected Box Office Collections Worldwide GV Prakash Kumar s film good start at GBOC

హ్యాపీరాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
జీవీ ప్రకాష్ కుమార్ క్రేజ్‌, ప్రమోషనల్ ఈవెంట్స్‌తో ఏర్పడిన బజ్ నేపథ్యంలో ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ద్వారా ఈ సినిమా ఇప్పటికే ప్రాఫిట్ జోన్‌లోకి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. హ్యాపీరాజ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుంది. అలాగే శాటిలైట్ రైట్స్‌కు కూడా మంచి డీల్ కుదిరినట్లుగా తెలుస్తోంది.

హ్యాపీరాజ్ సినిమాను కేరళలో ఎస్ఎస్ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ రిలీజ్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అనుబంధ మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ చేస్తోంది. ఓవర్సీస్‌లో డీఎంవై క్రియేషన్స్ రిలీజ్ చేస్తోంది. హ్యాపీరాజ్ మూవీకి 15 కోట్ల రూపాయల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 30 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

హ్యాపీరాజ్ తొలిరోజు కలెక్షన్స్ అంచనా
ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ సహా పలు సినిమాలు థియేటర్లలో ఉండగా హ్యాపీరాజ్ విడుదల కావడం సాహసమనే చెప్పాలి. అయితే కంటెంట్ మీద నమ్మకంతో నిర్మాతలు ముందడుగు వేశారు. కామెడీ, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ దండిగా ఉండటంతో కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు. తమిళనాడు నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు.

తొలిరోజున హ్యాపీరాజ్ మూవీకి 25 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సినిమాకు ఇండియా వైడ్‌గా 1.80 కోట్ల రూపాయల నెట్ వసూలైంది. తొలి రోజు హ్యాపీరాజ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 2.50 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ లభించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X