Happy Re Release Collections: కేరళలో అల్లు అర్జున్ మేనియా.. హ్యాపీ రీ రిలీజ్‌లో కలెక్షన్స్ ఎంతంటే?

కేరళలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఏ స్థాయిలో అభిమాన గణం ఉందో అదే స్థాయిలో కేరళ గడ్డపైనా బన్నీకి ఫాలోయింగ్ ఉంది. కెరీర్ తొలినాళ్లలోనే అల్లు అర్జున్ సినిమాలో కేరళలో విడుదలైన భారీ విజయాలను అందుకున్నాయి. అక్కడి అగ్రనటుల్ని మించి వసూళ్లను రాబట్టేవి. అంతేకాకుండా మల్లూ అర్జున్ అంటూ కేరళ ప్రజలు ఆయనను తమ ఇంట్లో మనిషిగా ఓన్ చేసుకున్నారు. తాజాగా అల్లు అర్జున్ హిట్ మూవీ హ్యాపీని కేరళలో రీ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో హ్యాపీ రీ రిలీజ్‌లో ఎంత రాబట్టిందో పరిశీలిస్తే..

హ్యాపీ తారాగణం:
ప్రేమ కథల స్పెషలిస్ట్ ఏ కరుణాకరన్ దర్శకత్వంలో హ్యాపీ చిత్రం తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన జెనీలియా హీరోయిన్‌గా నటించారు. మనోజ్ బాజ్‌పేయ్, కిశోర్, దీపక్ శిర్కే, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, సీత, రమాప్రభ, సుమన్ శెట్టి, ఎంఎస్ నారాయణ, వేణు మాధవ్ తదితరులు కీలక ప్రకటించారు. రాధా మోహన్ కథను అందించగా.. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. ఆంటోనీ ఎడిటర్‌గా సేవలందించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

Happy Re-Release Day 1 Collections Allu Arjun s film dominance in the Kerala Box Office

హ్యాపీ బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్‌తో కలిపి హ్యాపీ మూవీని దాదాపు 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. 27 జనవరి 2006న హ్యాపీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరుణాకరన్ టేకింగ్, అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే వసూళ్లపరంగా హ్యాపీ నిరాశపరిచినట్లు టాలీవుడ్ టాక్. దాదాపు 17 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతారు.

హ్యాపీ రీ రిలీజ్:
ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. బాహుబలి ది ఎపిక్, బిజినెస్‌మెన్, మురారి, ఖలేజా, డార్లింగ్, పోకిరి, ఖుషి, గబ్బర్ సింగ్, జల్సా తదితర సినిమాలు రీ రిలీజ్‌లో మంచి వసూళ్లను సాధించి సత్తా చాటాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన హ్యాపీ మూవీ కూడా రీ రిలీజ్ అయ్యింది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కాదు. మలయాళంలో. హ్యాపీ బీ హ్యాపీ అంటూ విడుదలైన అల్లు అర్జున్ మూవీకి కేరళ ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారు.

హ్యాపీ థియేటర్ల వద్ద సందడి
హ్యాపీ రీ రిలీజ్ సందర్బంగా కేరళలో అల్లు అర్జున్ మేనియా కనిపించింది. థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అవుతూ.. ప్రేక్షకులు డ్యాన్స్‌లు, హంగామా చేస్తూ సందడి చేశారు. ఈ సినిమాలోని అల్లు అర్జున్ డైలాగ్స్, డ్యాన్స్, మేనరిజమ్స్ చూసి మలయాళ ప్రజలు అరుపులు, కేకలతో రచ్చ చేశారు. ఒక పరభాషా నటుడి పాత డబ్బింగ్ సినిమా రీ రిలీజ్ అయితే ఈ స్థాయిలో సందడి నెలకొనడాన్ని బట్టి చూస్తే కేరళలో అల్లు అర్జున్ క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అటు కలెక్షన్స్ పరిశీలిస్తే హ్యాపీ బీ హ్యాపీ మూవీకి కేరళ వ్యాప్తంగా తొలిరోజున 29 లక్షల రూపాయలు వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

రీ రిలీజ్‌లో హ్యాపీ రికార్డ్
అంతేకాదు.. రీ రిలీజ్‌లో కేరళలో తొలిరోజున అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాలలో హ్యాపీ 9వ స్థానం నిలిచింది. అంతకంటే ముందు స్పదికం (88 లక్షల రూపాయలు), రావణ ప్రభు (73 లక్షల రూపాయలు), మణిచిత్రాతాజు (50 లక్షల రూపాయలు), అవతార్ (43 లక్షల రూపాయలు), ఇంటర్‌స్టెల్లర్ (38 లక్షల రూపాయలు), చోటా ముంబై (37 లక్షల రూపాయలు), బాహుబలి ది ఎపిక్ (31.5 లక్షల రూపాయలు), దేవదూతన్ (30 లక్షల రూపాయలు) నిలవగా.. హ్యాపీ తర్వాతి స్థానంలో వెలయాట్టన్ (23 లక్షల రూపాయలు) ఉన్నాయి. మరి రీ రిలీజ్‌లో కేరళలో హ్యాపీ మూవీ ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X