హ్యాపీడేస్ సినిమా సెంచరీ కొట్టేసింది. ఆ ఉత్సాహంలో హ్యాపీడేస్ సినిమా టీం ఉత్సవాలు జరుపుకుంటోంది. రొటీన్ కు భిన్నంగా ఈ ఉత్సవాలు జరిగాయి. థియేటర్లోనో లేక స్టేడియంలోనో కాకుండా ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో ఈ ఉత్సవాలు జరిగాయి. హ్యాపీడేస్ సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల సారథ్యంలో ఒక బస్సులో చిత్ర నటీనటులు ఎంపిక చేసిన ఆరు కాలేజీలకు వెళ్లారు. అక్కడ వీరికి ఊహించని రీతిలో స్వాగతం లభించింది. ఉత్సాహంగా ఉత్సవాలను జరుపుకున్నారు. ఆయా కాలేజీలలో వీరు విద్యార్థులతో కలిసి సంతోషంగా గడిపారు. ముందుగా ఈ టీమ్ రిషీ కాలేజ్ లో ఉత్సవాలను జరిపింది.