50డేస్-హ్యాపీడేస్!!!
శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ సంతోషంగా(నవంబర్ 20) అర్థ సెంచరీని పూర్తిచేసుకుంది. సంతోషంగా ఎందుకంటే ఇక్కడ మిగతా సినిమాలు కూడా అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాయి కానీ థియేటర్లలో జనం లేకుండా. బలవంతగా అంటే థియేటర్లలో జనం లేకున్నా 50 రోజులను పూర్తి చేసుకున్నాయన్నమాట. అయితే హ్యాపీడేస్ సినిమా మాత్రం విడుదైల ప్రధాన థియేటర్ దేవిలో రికార్డులను తిరగరాస్తోంది. 50 రోజుల పాటు అన్ని రోజులు అన్ని షోలు హౌస్ ఫుల్ గా నడిచింది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 135 థియేటర్లలో 50 రోజులను పూర్తి చేసుకుంది. ఒక హైదరాబాద్ లోనే 17 థియేటర్లలో 50 రోజులను పూర్తిచేసుకుంది. 25 ప్రింట్లతో తన ప్రభంజనాన్ని మొదలెట్టిన హ్యాపీడేస్ సినిమా ప్రస్తుతం 135 ప్రింట్లతో విజయవంతంగా నడుస్తోంది. చిత్రాన్ని పంపిణీ చేసిన దిల్ రాజు ఆనందంగా ఉన్నాడు. ఈ చిత్రం ఇస్తున్న లాభాలతో దిల్ రాజు కొత్త బంగారులోకం సినిమాను రూపొందించే పనిలో పడ్డాడు. ఇదే ఊపుతో హ్యాపీ డేస్ చిత్రం 100 రోజులను కూడా పూర్తిచేసుకోవడం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











