హ్యాపీడేస్ అతిథి
దసరా ముందే సినిమాలన్నీ విడుదల అయ్యాయి. ఇంకా చెప్పుకోదగ్గ విడుదలలు ఈ మధ్య ఇక లేవు. ఉన్న సినిమాలలోనే మంచి సినిమాలను వెతుక్కోవడమే ప్రేక్షకుల పని. గత వారంలో విడుదల అయిన తులసి, పెళ్లైయింది కానీ అంతకుముందు వారం విడుదల అయిన భయ్యా సినిమాలు ప్రేక్షకులను థియేటర్ రాబట్టడంలో విఫలం అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ తరణ్ సినిమా మోస్తరుగా నడుస్తుండగా శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ హౌస్ ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా నడుస్తోంది. రోజురోజుకు థియేటర్ల సంఖ్యను పెంచుకుంటోంది. ప్రస్తుతం 13 ఉన్న థియేటర్ల సంఖ్య శనివారం నుంచి ఈ సంఖ్య 15కు పెరగనున్నది. హ్యాపీడేస్ సండేలాగుంటుంది అన్నట్టు హ్యాపీడేస్ సినిమాను ఈ హాలీడేస్ లో ప్రేక్షకులు యమాయంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా విడుదల అయిన మహేష్ బాబు సినిమా అతిథి భారీ ఓపెనింగ్స్ తో తన ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఆ సినిమాకు ఆదరణ మున్ముందు ఎలా ఉంటుందో చెప్పలేంకానీ మొదటివారం మాత్రం ఢోకా లేదు. ఈ సినిమా యాక్షన్ సీన్ లలో పోకిరీని తలపిస్తోంది. హీరోయిన్ తో సీన్ లు సైతం దాదాపు పోకిరి టెంపర్ నే కలిగి ఉన్నాయి. కామెడీ కూడా అదే టైపు. కొద్దిగా మనసుపెడితే తెలుస్తుంది. మహేష్ బాబు పేరుతోనే ఆ సినిమా మాయ చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ వారం మాత్రం హ్యాపీడేస్, అతిథిల వారంగా చెప్పవచ్చు. వచ్చే వారం సీన్ లోనూ పెద్దగా మార్పులు ఉండవని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











