దేవి థియేటర్ లో హ్యాపీడేస్ రికార్డు
శేఖర్ కమ్ముల చిత్రం హ్యాపీడేస్ సంచలనం సృష్టిస్తోంది. విమర్షకుల ప్రశంసలే కాకుండా నిర్మాత జేబులు కూడా నింపుతున్న ఈ సినిమా రోజురోజుకు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొంటోంది. ఈ సినిమా విడుదల అయిన ప్రధాన థియేటర్ దేవీలో ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. 49 రోజుల్లో రూ.59 లక్షలు వసూలు చేసింది. దేవి థియేటర్ చరిత్రలో ఇంతకుముందు ఏ సినిమా ఇలాంటి వసూళ్లు చేయలేదు. మొత్తం 160 షోలు ఈ సినిమా హౌస్ ఫుల్ గా నడిచింది. ఇంకా హౌస్ ఫుల్ గా నడుస్తోంది. మరిన్ని సంచలనాలకు ఈ మంచి సినిమా వేదికగా నిలవాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











