Hara Hara Veera Mallu Day 1 Collection: హరిహర వీరమల్లు రికార్డు ఓపెనింగ్స్.. పవన్ మూవీకి ఎన్ని కోట్లంట్లే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాపై అంచనాలకు తగినట్టే.. ప్రమోషన్స్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..
హరిహర వీరమల్లు సినిమాను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సినిమాకు మూడు కరోనా లాక్‌డౌన్స్ అడ్డంకిగా నిలిచాయి. దాంతో అనేక రకాల సమస్యలు ముందుకు వచ్చాయి. క్రిష్ ఈ సినిమా నుంచి వైదొలగడం, సినిమా క్రియేటివ్ విషయాలపై క్లారిటీ లేకపోవడంతో మూవీ రిలీజ్ అవుతుందా? లేదా అనే విషయం సందిగ్దంలో పడింది. అయితే దర్శకుడిగా జ్యోతికృష్ణ ఛార్జ్ తీసుకొన్న తర్వాత ఈ సినిమా స్వరూపమే మారిపోయింది. టెక్నికల్‌గా ఈ మూవీ మరింత స్ట్రాంగ్‌గా తయారైంది. దాంతో ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరిగింది.

అయితే ముందుగా ప్లాన్ చేసుకొన్న ప్రకారం నటీనటులు కాకుండా తెరపైకి కొత్త యాక్టర్లు తెరపైకి వచ్చారు. బాబీ డియోల్ లాంటి యాక్టర్లు మూవీలో భాగమయ్యారు. స్టార్ యాక్టర్లు, స్టార్ యాక్టర్లు ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో బడ్జెట్ రెండింతలు పెరిగింది. ఈ సినిమాను సుమారుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో హరిహర వీరమల్లు పూర్తి చేశారు.
ఒ
హరిహర వీరమల్లు రిలీజ్‌కు అన్ని హంగులు సమకూర్చుకొని ముస్తాబవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో డైరెక్ట్‌గా పవన్ కల్యాణ్ ఇన్వాల్వ్ కావడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. జూలై 21వ తేదీన హైదరాబాద్‌లో మీడియాతో జరిగిన ఇంటరాక్షన్‌లో పవన్ ఈ సినిమా గురించి చెప్పిన విషయాలు ఈ చిత్రాన్ని ట్రెండింగ్‌లోకి తెచ్చాయి. దాంతో ట్రేడ్, డిస్టిబ్యూటర్ వర్గాల్లో జోష్ పెరుగుతున్నది. ఏరియాల వారీగా బిజినెస్ వ్యాపారాలు ఊపందుకొన్నాయి.
హరిహర వీరమల్లు సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాను సుమారుగా ఏపీ, తెలంగాణలోనే 700 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా రిలీజ్‌కు ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్లను భారీగా ప్లాన్ చేశారు. పెయిడ్ ప్రీమియర్లకు, స్పెషల్ షోలకు సుమారు 600 రూపాయల మేర టికెట్ రేట్లు పెట్టారనేది అనధికారికంగా వెల్లడైన సమాచారం. దాంతో ఈ సినిమాపై భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.
ఇక ట్రేడ్ వర్గాలు, డిస్టిబ్యూటర్ల సమాచారం మేరకు.. ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్లు, అలాగే స్పెషల్ షోలు, రెగ్యులర్ షోలను భారీగా ప్లాన్ చేశారు. దాంతో ఈ సినిమా తొలి రోజు ఏపీ, తెలంగాణలో 80 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ డాలర్లు రావొచ్చని వెల్లడిస్తున్నారు. ఇక రిలీజ్ తర్వాత టాక్‌ను బట్టి పెరగడం, తగ్గడం ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











