»   » హార్డ్ డిస్క్ ప్లాబ్లమ్..ఈ రోజు రిలీజ్ కాదా?

హార్డ్ డిస్క్ ప్లాబ్లమ్..ఈ రోజు రిలీజ్ కాదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హరర్ కామెడీ ప్రధానంగా రాఘవ లారెన్స్ దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం కాంచన. ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ముని చిత్రానికి సీక్వెల్ కాంచన, మరి ఈ కాంచన సీక్వెల్ గంగ...ముని 3 అయితే ఇప్పుడు గంగ (మని-3) ఈ రోజువిడుదల తేదీ ఇచ్చారు. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రిలీజ్ అవ్వటం కష్టమనే మాట వినపడుతోంది.

వివరాల్లోకి వెళితే...ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో ..డిజిటిల్ ప్రొజక్షన్ థియోటర్స్ ఎక్కువ. అంటే హార్ట్ డిస్క్ ఉదయం ఏడు గంటల లోపు వచ్చేయాలి. అప్పుడు ప్రొజక్షన్ సిస్టమ్ లో లోడ్ చేస్తారు. ఎందుకంటే... మినిమం రెండున్నర గంటలు సేపు ఈ హార్డ్ డిస్క్ కాపీ అవుతుంది. అయితే ఇప్పటివరకూ హార్డ్ డిస్క్ కాపీ రెడీ కాలేదని తెలుస్తోంది. దాంతో ఈ చిత్రం విడుదల రేపటకి వాయిదా పడే అవకాసం ఉందని చెప్తున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ గా నిర్మాత నుంచి సమాచారం ఏమీ లేదు. ఇది కేవలం ఫిల్మ్ సర్కిల్స్ లో, ట్రేడ్ వర్గాల్లో చెప్పుకోబడుతున్నది మాత్రమే.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Hard Disk problems for Raghava Lawrence Ganga?

ముని 3 అంటూ టైటిల్‌పై పెట్టి కాంచన-2 అంటూ సినిమాపేరు ఉంచారు. ఓ రకంగా తెలుగు, తమిళంలో రూపొందుతున్న 3వ సీక్వెల్ సినిమాగా చరిత్రలో నిలిచిపోతుంది. ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై అంచనాలు కలిగేలా చేశారు రాఘవ. పసుపుతో నిండిన ఫోటోలో భక్తుని రూపంలో చేతి నిండా గాయాలతో ఉంది ఫస్ట్‌లుక్ ఫోటో. ఇంకా ఈ చిత్రంలో తాప్సీ, నిత్యామీనన్‌లు నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఏడాదికి పైగా శ్రమించారు. కాంచన-2కు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు.ఈ చిత్ర ఆడియోను ఈ నెలాఖరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Hard Disk problems for Raghava Lawrence Ganga?

కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన రాఘవ లారెన్స్ ఎన్నో హిట్ చిత్రాలకు డ్యాన్స్ కంపోజ్ చేశారు. తెలుగు, తమిళ చిత్రసీమల్లోని దాదాపుగా అందరు స్టార్ హీరోలతో ఆటాడించాడు. హీరో దర్శకుడిగా స్టెల్, ముని,కాంచన, సినిమాలతో విజయం అందుకున్నారు. దర్శకుడిగా నాగార్జునతో మాస్,డాన్ సినిమాలతో హిట్ కొట్టగా, యంగ్ రెబల్‌స్టార్‌తో చేసిన రెబల్ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. మళ్ళీ ఇప్పుడు కాంచన-2తో మన ముందుకొస్తున్నారు. హరర్ కామెడీ చిత్రాలతో విజయాన్నందుకున్న రాఘవ కాంచన-2తో అంచనాలను అందుకుంటాడో లేదో వేచి చూడాలి.


రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: థమన్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

English summary
Digital movie format providers haven’t readied Ganga movie hard disks till now as they haven’t received copy of Censor Certificate. Seems like release will be pushed to April 18th.
Please Wait while comments are loading...