2 లక్షల మంది వెయిటింగ్.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రిపోర్ట్
వెండితెరపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శనం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తో 2024 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. దేశంలోనే పవన్ కళ్యాణ్ వందశాతం సక్సెస్ అందుకున్న పొలిటికల్ పార్టీగా రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తర్వాత తొలిసారిగా 'హరి హర వీరమల్లు'తో వెండితెరపై కనిపించబోతున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాకు అడ్వాన్స్ బుక్కింగ్స్ కు సంబంధించిన రిపోర్ట్ వెల్లడైంది.
హరి హర వీరమల్లు బడ్జెట్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -క్రిష్ జాగర్లముడి కాంబినేషన్ లో ప్రారంభమైన చిత్రమే 'హరి హర వీరమల్లు'. తర్వాత ఈ చిత్రాన్ని ఏఎం జ్యోతి రత్నం దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఎట్టకేళలకు ఈ సినిమా పూర్తై పోయింది. 5 ఏళ్ల పాటు ఈ సినిమా నిర్మితమవుతూనే ఉంది. లాంగ్ టైమ్ గా రూపుదిద్దుకుంటూనే వస్తోంది. కాబట్టి ఈ సినిమా బాగానే ఖర్చైంది. దాదాపుగా రూ. 200 కోట్ల వరకు ఖర్చు పెట్టామని నిర్మాత ఏఎం రత్నం చెప్పారు. మెగా సూర్య ప్రొడక్షన్ పై రూపుదిద్దుకున్నఈ యాక్షన్ ఫిల్మ్ లో భారీ తారగణం నటించింది.

BMSలో హరి హర వీరమల్లు రికార్డు..
ఈ చిత్రం ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా? అని అభిమానులు, నార్మల్ ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే అంతకంతకూ ఆలస్యం అవుతూనే వస్తోంది. ఇప్పటికే 10 సార్లు ఈ చిత్రం వాయిదా పడటం గమనార్హం. అయినా సినిమాపై అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయే గానీ అస్సలు తగ్గడం లేదు. ఈ క్రమంలో బుక్ మై షో (BMS) తాజాగా ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. ఈ సినిమా కోసం ఏకంగా 2 లక్షల మంది వెయింటింగ్ లో ఉన్నారంట. బుక్కింగ్స్ ఓపెన్ అయినా ఐదు పది నిమిషాల్లోనే రూ.5 కోట్లకు పైగా ఆదాయం రానుందని నిపుణులు అంటున్నారు. మరోవైపు 200కే ఆడియన్స్ హరి హర వీరమల్లు కోసం వెయింటింగ్ లో ఉన్నారని మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించడం విశేషం.
రికార్డు తిరగరాస్తారా?
పవన్ కళ్యాణ్ పొలికల్ గా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాంతో 2 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. పవనుడు వెండి తెరపై కనిపించి దాదాపు 3 ఏళ్లు కావస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎంగా, పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచాక తొలిసారిగా వెండితెరపై కనిపించబోతుండటంతో హరి హర వీరమల్లు చిత్రానికి భారీ స్థాయిలో వసూళ్లు వస్తాయని అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తుండటంతో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టం ఖాయమని అంటున్నారు. ఇక ఓపెనింగ్ డే వసూళ్లపై ఇప్పటి నుంచే ఆసక్తి మొదలైంది.
మరొకసారి విడుదల వాయిదా..
హరి హర వీరమల్లు చిత్రం మరోసారి వాయిదా పడింది. జూన్ 12న థియేటర్లలోకి రావాల్సిన చిత్రం పోస్ట్ పోన్ అయ్యింది. మరింత విజువల్ వర్క్ పెండింగ్ ఉండటంతో ఆలస్యం అవుతోంది. త్వరలోనే ట్రైలర్ విడుదలకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పవర్ ఫుల్ ట్రైలర్ తోనే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేస్తామని అధికారికంగా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











