Hari Hara Veera Mallu Total Collections: హరి హర వీరమల్లు టోటల్ కలెక్షన్స్.. లాభమా? నష్టమా?
ఏపీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా వెండితెరపై మెరిసిన చిత్రం హరిహర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు. క్రిష్ జాగర్లముడి తొలుత ఈ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేశారు. కానీ ఆలస్యం అవడంతో ఆయన తప్పుకొని ఏఎం రత్నం దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. హరిహర వీరమల్లు : పార్ట్ 1ను జూలై 24న గ్రాండ్ గా విడుదల చేశారు. నిధి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఎంఎం కీరవాణి సంగీం అందించారు. కాగా ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? టోటల్ గా వరల్డ్ వైడ్ ఎన్ని కోట్లు వసూళ్లు చేసింది? లాభమా? నష్టమా? అనే వివరాల్లోకి వెళితే..
హరిహర వీరమల్లు బడ్జెట్?
పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్ వంటి స్టార్ కాస్ట్ ఈ చిత్రంలో నటించింది. ఇక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం, వీఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్లుగా పనిచేయడం విశేషం. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, భారీ నిర్మాణ వ్యయం, ప్రచార ఖర్చులన్నీ కలుపుకొని ఈ చిత్రానికి రూ.250 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ బిజినెస్? టార్గెట్?
హరిహర వీరమల్లు చిత్రానికి తెలుగు స్టేట్స్ లో నైజాం రూ.37 కోట్లు, సీడెడ్ రూ. 16 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.12 కోట్లు, తూర్పు గోదావవరిలో రూ.9.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.7 కోట్లు, గుంటూరులో రూ.9.5 కోట్లు, కృష్ణాలో రూ.7.6 కోట్లు, నెల్లూరులో రూ.4.4 కోట్ల బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.103 కోట్ల వ్యాపారం అయ్యింది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో రూ.12.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.10 కోట్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా పవన్ కళ్యాణ్ చిత్రానికి రూ.126 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. ఇక ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్ గా రూ.260 కోట్లు వసూల్ చేయాల్సి ఉందని విలువ కట్టారు. ఇక ఇందులో రూ.210 కోట్లు తెలుగు స్టేట్స్ నుంచే కలెక్ట్ చేయాలని ట్రేడ్ నిపుణుల బ్రేక్ ఈవెన్ టార్గెట్ నిర్ణయించారు.
హరిహర వీరమల్లు టోటల్ కలెక్షన్స్..
జూలై 24న విడుదలైన ఈ చిత్రం 3 వారాల్లోనే పూర్తిగా కలెక్షన్స్ ఆగిపోయాయి. ఇక ఈ చిత్రానికి ఓపెనింగ్ డే రూ.41 కోట్లు ఇండియా గ్రాస్ నెట్, 2వ రోజు రూ.9.4 కోట్లు, 3వ రోజు రూ.10.8 కోట్లు, 4వ రోజు రూ.12.5 కోట్లు, 5వ రోజు రూ.2.45 కోట్లు, 6వ రోజు రూ.2.05 కోట్లు, 7వ రోజు రూ.1.55 కోట్లు, 8వ రోజు రూ.85 లక్షలు, 9వ రోజు రూ.65 లక్షలు, 10వ రోజు రూ.1.05 కోట్లు, 11వ రోజు రూ.1.3 కోట్లు, 12వ రోజు రూ.40 లక్షలు, 13వ రోజు రూ.35 లక్షలు వసూల్ చేసిందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక ప్రీమియర్స్ ద్వారా రూ.15 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది.
ఇక 13వ రోజు వరకు ఈ చిత్రానికి రూ.99.35 కోట్ల గ్రాస్ వసూలైందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక 14వ రోజు నుంచి 21వ రోజు వరకు 8 రోజుల్లో ఈ చిత్రం మరో రూ.4 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ లెక్కలు తెలుపుతున్నాయి. ఇలా టోటల్ గా ఈ చిత్రం ఇండియా నెట్ రూ.88 లక్షలు, ఇండియా గ్రాస్ రూ.103 కోట్లు, ఓవర్సీస్ రూ.15 కోట్లు గ్రాస్ వసూల్ చేసిందని తెలుపుతున్నారు. ఇక ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.118 కోట్లు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు లెక్క చెబుతున్నారు.
హరిహర వీరమల్లు స్టేట్ వైజ్ కలెక్షన్స్
పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన హరి హర వీరమల్లు చిత్రం ఇప్పటి వరకు తెలుగు స్టేట్స్ లో (ఏపీ+తెలంగాణ) రూ.88.50 కోట్లు, కర్ణాటకలో రూ.7.50 కోట్లు, తమిళనాడులో రూ.1.25 కోట్లు, కేరళలో రూ.26 లక్షలు, రెస్టాఫ్ ఇండియా(ROI)లో రూ.2.04 కోట్లు వసూళ్లు చేసిందని సాక్ నిక్ బాక్సాఫీస్ రిపోర్ట్ లో తెలియజేసింది.
లాభమా? నష్టమా?
హరి హర వీరమల్లు చిత్రం బడ్జెట్, ప్రీ రిలీజ్ లెక్కల ప్రకారం ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.260 కోట్లు గ్రాస్ వసూల్ చేయాల్సి ఉండింది. కానీ టోటల్ గా బాక్సాఫీస్ వసూళ్లు ప్రపంచ వ్యాప్తంగా రూ.118 కోట్లు అందాయి. దీంతో ఇంకా రూ.132 కోట్లు నష్టాల్లోనే ఉందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా భారీగానే అందినా ఇంకా రూ.60 కోట్ల రూపాయలకు పైగానే నష్టాలు చవిచూసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











