హరి హర వీరమల్లు ఏరియా వైజ్ బిజినెస్.. తెలుగు స్టేట్స్ లో ఎన్ని కోట్లంటే?

జూలై 24న హరి హర వీరమల్లు చిత్రం ఇండియా + ఓవర్సీస్ కలుపుకొని వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓవర్సీస్ లో పెయిడ్ ప్రీమియర్స్ షో పడ్డాయి. ఇక జూలై 23న సాయంత్రం 9 గంటలకు తెలంగాణ, ఏపీలో పెయిడ్ ప్రీమియర్స్ గ్రాండ్ గా ప్రదర్శితం కానుంది. ఈ క్రమంలో హరి హర వీరమల్లు చిత్రం తెలంగాణ, ఏపీలో ఎన్ని కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది, ఏరియా వైజ్ గా ఎంత వ్యాపారం జరిగిందనేది వివరాలు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా ఫిల్మ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరిగా వెండితెరపై బ్రో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత పొలిటికల్ ప్రొగ్రామ్స్ తో సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చారు. ఆ సమయంలో హరి హర వీరమల్లు చిత్రం ఆలస్యమవుతూ వచ్చింది. అంతకు ముందు పవన్ కళ్యాణ్ రీజినల్ చిత్రాల్లోనే నటించారు. ఇక తొలిసారిగా హరి హర వీరమల్లు చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. తెలుగు, తమిళం, హిందీ, తమిళం, మలయాళంలో విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Hari Hari Veeramallu Telugu States Pre Release Business

తెలంగాణ + ఏపీ ఏరియా వైజ్ బిజినెస్..
హరి హర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక తెలంగాణ, ఏపీలో కలిసి ఏరియా వైజ్ గా బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ.37 కోట్లు, సీడెడ్ రూ.16 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.12 కోట్లు, ఈస్ట్ రూ.9.50 కోట్లు, వెస్ట్ రూ.7 కోట్లు, గుంటూరు రూ.9.50 కోట్లు, కృష్ణ రూ.7.60 కోట్లు, నెల్లూరు రూ.4.40 కోట్లు బిజినెస్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

ఇక కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా రూ.12.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ.10 కోట్లు బిజినెస్ చేసింది. తెలంగాణ + ఏపీలో కలిపి మొత్తంగా 103 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఇండియా మొత్తంగా 116 కోట్ల రూపాయలు వ్యాపారమైంది. ఇలా వరల్డ్ వైడ్ గా హరి హర వీరమల్లు చిత్రానికి రూ.126 కోట్ల బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ రేంజ్ బిజినెస్ జరగడం పవన్ కళ్యాణ్ కెరీయర్ లోనే మొదటి సారి అని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు చిత్రానికి బాక్సాఫీస్ కలెక్షన్లు ఎన్ని కోట్లు అవుతాయనేది ఆసక్తికరంగా మారింది.

భారీ బడ్జెట్ తో హరి హర వీరమల్లు..
హరి హర వీరమల్లు చిత్రానికి భారీ బడ్జెట్ ను వెచ్చించారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం 250 కోట్ల రూపాయలతో నిర్మించడం విశేషం. మొదటి భాగంగా హరి హర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X