HHMV Telugu States Collection: నెగిటివ్ ట్రెండ్‌లో హరిహర వీరమల్లు కుమ్ముడు.. ఆంధ్రా నైజాంలో ఎన్ని కోట్లంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథా నాయకుడిగా నటించిన హరిహర వీరమల్లు సినిమా అట్టహాసంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజై మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని కొనసాగిస్తున్నది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుంచి చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న డైరెక్టర్ ఏఎం జ్యోతి కృష్ణ.. వెండితెరపై భావోద్వేగాలను భారీగా పండించారు. ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వా‌ల్‌తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వీఎస్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా, ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్‌లను, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. హరి హర వీరమల్లు చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్క్రీన్లలో రిలీజైంది. ఈ సినిమా ఆంధ్రా, నైజాం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాల్లోకి వెళితే..

Harihara Veeramallu 4 days Andhra Nizam

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. నైజాంలో హక్కులు 37 కోట్ల రూపాయలు, సీడెడ్ 16 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్ర 12 కోట్లు, తూర్పు గోదావవరి జిల్లా 9.5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 9.5 కోట్ల రూపాయలు, కృష్ణా 7.6 కోట్లు, నెల్లూరు 4.4 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఈ సినిమా నైజాం, ఆంధ్రాలో కలిపి 103 కోట్ల రూపాయలు మేర జరిగింది. 104 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ల టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లు భారీగా వసూళ్లను సాధించాయి. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 8.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 31.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 4 కోట్ల రూపాయలు, 3వ రోజు 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మూడు రోజుల్లో 48.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

హరిహర వీరమల్లు సినిమా మూడు రోజుల్లో ఆంధ్రా, నైజాం ప్రాంతాల్లోని వివిధ ఏరియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 16.2 కోట్లు, సీడెడ్ 7 కోట్లు, ఉత్తరాంధ్ర 6.5 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా 4.75 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా 4 కోట్ల రూపాయలు, గుంటూరు 4.75 కోట్లు, కృష్ణా జిల్లా 4 కోట్లు, నెల్లూరు 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో మొత్తం 48 కోట్లకుపైగా షేర్.. 68 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ఇక నాలుగో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఆదివారం కావడంతో ఈ సినిమా నిలకడగా భారీగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం 7 కోట్ల షేర్, 14 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసినట్టు ప్రాథమికంగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 55 కోట్ల షేర్, 83 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇదిలా ఉండగా, ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ఇంకా 48 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X