HHMV AP TG 6 days Collection: హరిహర వీరమల్లు 6 రోజులు కలెక్షన్లు.. భారీ నష్టాల నుంచి బయటపడాలంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా అట్టహాసంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుంచి చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న డైరెక్టర్ ఏఎం జ్యోతి కృష్ణ.. వెండితెరపై భావోద్వేగాలను భారీగా పండించారు. ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్ తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు.

హిందువులప ఔరంగజేబు దాష్టికాలు అనే కథా నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వీఎస్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్లుగా, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్‌లను, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. హరి హర వీరమల్లు చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్క్రీన్లలో రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాల్లోకి వెళితే..

Harihara Veeramallu 6 Days collections

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. నైజాంలో హక్కులు 37 కోట్ల రూపాయలు, సీడెడ్ 16 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్ర 12 కోట్లు, తూర్పు గోదావవరి 9.5 కోట్లు, పశ్చిమ గోదావరి 8.5 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 9.5 కోట్ల రూపాయలు, కృష్ణా 7.6 కోట్లు, నెల్లూరు 4.4 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఈ సినిమా నైజాం, ఆంధ్రాలో కలిపి 103 కోట్ల రూపాయలు మేర జరిగింది.

హరిహర వీరమల్లు సినిమా 6వ రోజున దారుణంగా వసూళ్లను సాధించింది. దాదాపు, ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లోని ప్రధాన పట్టణాల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి కనిపించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నైజాంలో ఈ చిత్రం 75 లక్షలు, ఆంధ్రాలో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్ రన్‌ను ముగించే స్థితిలో కనిపిస్తున్నది.

తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల విషయానికి వస్తే.. పెయిడ్ ప్రీమియర్లకు 8.5 కోట్ల రూపాయలు, తొలి రోజు 31.5 కోట్ల రూపాయలు, 2వ రోజు 4 కోట్ల రూపాయలు, 3వ రోజు 4. కోట్ల రూపాయలు, 4వ రోజు 6 కోట్ల రూపాయలు, 5వ రోజు 1.16 కోట్ల రూపాయలు, 6వ రోజు 1.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
నైజాంలో 19.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 7.6 కోట్లు, ఉత్తరాంధ్రలో 7.2 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 6 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4.5 కోట్లు, గుంటూరులో 5.5 కోట్లు, కృష్ణా జిల్లాలో 5 కోట్లు, నెల్లూరులో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆంధ్రా, నైజాంలో 56 కోట్ల షేర్, 82 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

తెలుగులో 82 కోట్ల రూపాయలు, కన్నడలో 7 కోట్ల రూపాయలు, తమిళంలో 1.5 కోటి రూపాయలు, మలయాళంలో 25 లక్షల రూపాయలు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఈ చిత్రం 92 కోట్ల రూ పాయలు, ఓవర్సీస్‌లో 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా 107.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో నష్టాల నుంచి బయటపడాలంటే.. ఇంకా 50 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X