HariHara VeeraMallu Closing Collections: హరిహర వీరమల్లు క్లోజింగ్ కలెక్షన్స్.. పవన్ మూవీకి లాభమెంత? నష్టమెంత?
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు నిర్మించిన చిత్రం హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జూలై 24న హరిహర వీరమల్లు మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐదేళ్ల పాటు ఎన్నో ఆటంకాలు ఎదుర్కోని ప్రేక్షకుల ముందుకు వచ్చింది హరిహర వీరమల్లు. పాటలు, టీజర్, ట్రైలర్లకు తోడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో వీరమల్లుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తీరిక లేని బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమాకు లాభమెంత? నష్టమెంత? అనే వివరాల్లోకి వెళితే..
హరిహర వీరమల్లు బడ్జెట్ & బిజినెస్
హరిహర వీరమల్లును రూ.250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. నైజాంలో 37 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 16 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 12 కోట్లు, తూర్పు గోదావవరిలో 9.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 9.5 కోట్ల రూపాయలు, కృష్ణా 7.6 కోట్లు, నెల్లూరు 4.4 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో పవన్ కళ్యాణ్ మూవీకి ఆంధ్రా, నైజాంలలో 103 కోట్ల రూపాయలు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో 12.5 కోట్లు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయలు మేర బిజినెస్ చేసింది. దాంతో వరల్డ్ వైడ్‌గా హరిహర వీరమల్లుకి 126 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జిరిగింది.

హరిహర వీరమల్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్
తెలుగు రాష్ట్రాలలో హరిహర వీరమల్లు లాభాల్లోకి రావాలంటే 104 కోట్ల రూపాయల షేర్.. 210 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. వరల్డ్ వైడ్‌గా పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 127 కోట్ల రూపాయల షేర్.. 260 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని విలువ కట్టారు. హరిహర వీరమల్లును వరల్డ్ వైడ్‌గా 5000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
హరిహర వీరమల్లు కలెక్షన్స్
పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 13 కోట్ల రూపాయలు, ఫస్ట్ డే నాడు 35 కోట్ల రూపాయలు, రెండో రోజున రూ.9 కోట్ల నెట్, 3వ రోజున రూ.9 కోట్లు, 4వ రోజున 11 కోట్ల రూపాయలు, 5వ రోజున రూ.2 కోట్లు, 6వ రోజున 2 కోట్ల కలెక్షన్స్, 7వ రోజున 1 కోటి రూపాయలు, 8వ రోజున రూ.46 లక్షలు, 9వ రోజున 28 లక్షలు, 10వ రోజున 44 లక్షల రూపాయలు, 11వ రోజున కోటి 50 లక్షల రూపాయలు, 12వ రోజున 50 లక్షలు, 13వ రోజున 40 లక్షల రూపాయలు, 14వ రోజు 30 లక్షల రూపాయలు, 15వ రోజు 1.20 కోట్ల రూపాయలు, 16వ రోజు 60 లక్షలు కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా 16 రోజుల వరకు ఇండియా వైడ్‌గా హరిహర వీరమల్లు మూవీకి 87 కోట్ల రూపాయల నెట్, 103 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 18 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకుని 16 రోజుల వరకు హరిహర వీరమల్లుకు 121 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి
తెలుగు రాష్ట్రాల్లో వీరమల్లు కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో 16 రోజుల వసూళ్లను పరిశీలిస్తే.. స్పెషల్ షోలతో 9 కోట్ల రూపాయలు, తొలి రోజున 32 కోట్ల రూపాయలు, 2వ రోజున 4 కోట్ల రూపాయలు, 3వ రోజున 5 కోట్ల రూపాయలు, 4వ రోజున 6 కోట్ల రూపాయలు, 5వ రోజున 2 కోట్ల రూపాయలు, 6వ రోజున 62 లక్షల రూపాయలు, 7వ రోజున 34 లక్షల రూపాయలు, 8వ రోజు 22 లక్షలు, 9వ రోజు 17 లక్షలు, 10వ రోజున 32 లక్షల రూపాయల, 11వ రోజున 45 లక్షల రూపాయలు, 12వ రోజున 15 లక్షల రూపాయలు, 13వ రోజున 12 లక్షల రూపాయలు, 14వ రోజు 25 లక్షలు, 15వ రోజు కోటి రూపాయలు, 16వ రోజు 50 లక్షలు రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి. దీంతో 16 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లుకు 60 కోట్ల రూపాయల షేర్, 92 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కలెక్షన్స్ పరిశీలిస్తే.. నైజాంలో 21 కోట్లు, సీడెడ్‌లో 10 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 8.5 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 7 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 6 కోట్ల రూపాయలు, గుంటూరులో 7 కోట్ల రూపాయలు, కృష్ణాలో 6 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.5 కోట్ల రూపాయలు చొప్పున వసూళ్లు అందుకుంది హరిహర వీరమల్లు. ఇండియాలోని ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 14 కోట్ల రూపాయల షేర్.. 30 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది. ఓవర్సీస్‌లో 8 కోట్ల రూపాయల షేర్ .. 9 కోట్ల రూపాయల గ్రాస్ చొప్పున వరల్డ్ వైడ్‌గా 16 రోజుల వరకు 74 కోట్ల రూపాయల షేర్.. 121 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది.
హరిహర వీరమల్లుకు లాభమెంత? నష్టమెంత?
మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ హరిహర వీరమల్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద మెరుగైన ప్రదర్శన చేసింది. అయితే రెండో వారం నుంచి వీరమల్లుకు ఊపు తగ్గింది. వీకెండ్‌లో తప్పించి వర్కింగ్ డేస్‌లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది వీరమల్లు. అర్బన్, రూరల్ ఏరియాలలోనూ క్రమంగా కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. పవన్ కళ్యాణ్ తన ఛరిష్మా మీద ఇప్పటి వరకు సినిమాను నెట్టుకొచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో 104 కోట్ల రూపాయాల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు గాను కేవలం 60 కోట్ల రూపాయల షేర్ మాత్రమే రాబట్టి.. దాదాపు 44 కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చింది. ఇక ఓవరాల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూస్తే 126 కోట్ల రూపాయలకు గాను 74 కోట్ల రూపాయల షేర్ అందుకుని 52 కోట్ల రూపాయల నష్టాలను తెచ్చాడు వీరమల్లు. మొత్తంగా 16 రోజుల వరకు కేవలం 36 శాతం రికవరీ మాత్రమే సాధించింది పవన్ కళ్యాణ్ మూవీ. నిర్మాత ఏఎం రత్నం దాదాపు 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను ఈ చిత్రానికి కేటాయించారు. కానీ హరిహర వీరమల్లు బాక్సాఫీస్ రిజల్ట్‌తో బడ్జెట్ పరంగా ఆయనకు దాదాపు 130 కోట్ల వరకు నష్టం జరిగినట్లే. కాకపోతే థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా నిర్మాత ఒడ్డునపడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











