అల్లు అర్జున్ రికార్డును కొట్టలేకపోయిన పవన్.. టాప్ ప్లేస్‌లోనే పుష్ప 2.. వీరమల్లుకు ఎన్ని కోట్లంటే?
లాంగ్ గ్యాప్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమా అనగానే బాక్సాఫీస్ దద్ధరిల్లిపోతుందన్న సంగతి తెలిసిందే. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఓపెన్సింగ్స్‌తోనే పవన్ ఊచకోత కోస్తాడు. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లుతో పవర్‌స్టార్ ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడోనని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
పుష్ప 2 కలెక్షన్స్ రికార్డ్
బాహుబలి సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను ప్రభాస్ వణికించాడు. బాహుబలి రికార్డులను బద్ధలు కొట్టడం అసాధ్యమనే రేంజ్‌కు తీసుకెళ్లాడు రాజమౌళి. అయితే పుష్ప సిరీస్‌తో ఆ అంచనాలు తప్పని నిరూపించారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన పుష్ప పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. ఇక పుష్ప 2 గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 1780 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో ఆల్‌మోస్ట్ బాహుబలి 2 రికార్డులను బద్ధలు కొడతాడని అంతా భావించారు. అయితే ఆ ఫీట్‌కు కొద్దిదూరంలో పుష్పరాజ్ శాంతించాడు.

పుష్ప 2 రికార్డులపై కన్ను
పుష్ప 2 చిత్రం పలు అంశాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ప్రీ రిలీజ్ బిజినెస్, ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ సహా అన్ని థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో లెక్కలు మార్చేసింది. ఇవే కాదు అడ్వాన్స్ బుకింగ్, టికెట్ సేల్స్, ప్రీమియర్స్ విషయంలోనూ పుష్ప 2 రికార్డులు అన్నీ ఇన్నీ కావు. పుష్ప 2 తర్వాత విడుదలైన ప్రతి పెద్ద సినిమాను అల్లు అర్జున్ చిత్రంతో పోల్చి చూస్తున్నారు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు గురించి కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
వీరమల్లు- పుష్ప 2ల రికార్డులపై చర్చ
పుష్ప 2 విడుదలైన దాదాపు 7 నెలల తర్వాత వస్తున్న చిత్రం కావడం, పైగా మెగా కుటుంబానికి చెందిన హీరో చిత్రం కావడంతో హరిహర వీరమల్లు ఎలాంటి రికార్డుల్ని నెలకొల్పుతుందోనని భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ రెండు చిత్రాల పెయిడ్ ప్రీమియర్స్, వాటికి వచ్చిన కలెక్షన్స్ గురించి ఫిలింనగర్‌లో హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో పవన్ అభిమానులు, బన్నీ అభిమానుల మధ్య రికార్డుల గురించి వార్ జరుగుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
ప్రీమియర్స్‌లో అల్లు అర్జున్ రికార్డు
పెయిడ్ ప్రీమియర్స్ విషయంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఆ రికార్డును హరిహర వీరమల్లు ఏమాత్రం కొట్టలేకపోయింది. డిసెంబర్ 5న పుష్ప 2 ది రూల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా.. దానికి ముందు రోజు డిసెంబర్ 4న రాత్రి తెలుగు రాష్ట్రాలతో పాటు యూకే, యూఎస్ సహా పలు ప్రాంతాలలో పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయి. ఇండియా వైడ్‌గా 640 షోలకు గాను 14.44 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. వీటిలో 13.03 కోట్ల రూపాయలు కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే వచ్చింది.
ప్రీమియర్స్‌లో వీరమల్లుకు ఎంతంటే?
ఇక పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు పెయిడ్ ప్రీమియర్స్ విషయానికి వస్తే .. జూలై 24న ఈ చిత్రం విడుదల కాగా, దానికి ముందు రోజు జూలై 23న తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లోని పలు ప్రాంతాల్లో పెయిడ్ ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు పడ్డాయి. ఇండియా వైడ్ 737 షోలకు గాను 12.93 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో 12.13 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ కింద వచ్చింది. పుష్ప 2 ప్రీమియర్స్ రికార్డ్స్ బద్దలు కొట్టే వరకు వచ్చి తృటిలో ఛాన్స్ మిస్ అయ్యింది. దీంతో పుష్ప 2 రికార్డ్ చెక్కు చెదరకుండా తన టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకుంది.


Click it and Unblock the Notifications











