Hari Hara Veeramallu Advance Booking: హరిహర వీరమల్లు అడ్వాన్స్ బుకింగ్ రపా రపా.. యూఎస్‌లో ఎన్ని కోట్లంటే?
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుంచి హరి హర వీరమల్లు చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న డైరెక్టర్ ఏఎం జ్యోతి కృష్ణ.. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి శాయశక్తులా కృషి చేశారు. ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్ తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్‌లను, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హరి హర వీరమల్లు చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక, ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. తొలి రోజు ప్రీ సేల్స్ ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

బెంగళూరులో ఈ సినిమా ప్రీ సేల్స్ గ్రాండ్‌గా మొదలయ్యాయి. తొలి రోజు ఈ చిత్రం 23 వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి. బెంగళూరులోనే ఈ చిత్రం 1 కోటి రూపాయలకుపైగా వసూలు చేసింది. ఇంకా ఒక రోజు ఉండటం వల్ల ఈ మొత్తం భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల్లో టాప్ గేర్‌లో అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. సుమారుగా 300 సిటీలలో 1100 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరిగాయి. రిలీజ్ నాటికి, ఆ తర్వాత టాక్‌ను బట్టి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 2 లక్షలకుపైగా టికెట్ రేట్లు అమ్ముడుపోయాయి. దాదాపు 50 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. మంగళవారం సాయంత్రం వరకు 6 కోట్ల రూపాయలు వసూలయ్యాయి అని వెల్లడించారు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్‌లో రికార్డు స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయని డిస్టిబ్యూటర్లు తెలుపుతున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ సేల్స్ తెలుగు రాష్ట్రాల్లో 15 నుంచి 18 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల రూపాయలు వసూలు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











