Harihara Veeramallu Box Office Day 1: హరిహర వీరమల్లుకు రికార్డు ఓపెనింగ్స్.. పవన్ కల్యాణ్ మూవీకి ఎన్ని కోట్లంట
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథా నాయకుడిగా నటించిన హరిహర వీరమల్లు సినిమా అట్టహాసంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుంచి చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న డైరెక్టర్ ఏఎం జ్యోతి కృష్ణ.. వెండితెరపై భావోద్వేగాలను భారీగా పండించారు. ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్ తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్‌లను, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హరి హర వీరమల్లు చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్క్రీన్లలో రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాల్లోకి వెళితే..

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మూడు కరోనా పరిస్థితులను, అలాగే ఇతర ఆర్థిక ఇబ్బందులను దాటుకొని ఈ సినిమా నిర్మాణం పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాలో భారీగా తారాగణం నటించారు. బాలీవుడ్ నుంచి బాబీ డియోల్, దలీప్ తాహిల్ లాంటి యాక్టర్లు నటించారు. ఈ సినిమాకు సాంకేతిక నిపుణులు రకరకాలుగా మారారు. విదేశాల్లో వీఎఫ్ఎక్స్ పనులు చేయించారు. దాంతో నిర్మాణ వ్యయం భారీగా అయింది. దాంతో ఈ సినిమా ఫైనల్ బడ్జెట్‌ను 350 కోట్లుగా తేల్చారు.
పవర్ స్టార్ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. నైజాంలో హక్కులు 37 కోట్ల రూపాయలు, సీడెడ్ 16 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్ర 12 కోట్లు, తూర్పు గోదావవరి 9.5 కోట్లు, పశ్చిమ గోదావరి 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్ాలో 9.5 కోట్ల రూపాయలు, కృష్ణా 7.6 కోట్లు, నెల్లూరు 4.4 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఈ సినిమా నైజాం, ఆంధ్రాలో కలిపి 103 కోట్ల రూపాయలు మేర జరిగింది.
ఈ సినిమా తెలుగేతర రాష్ట్రాలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 12.5 కోట్ల మేర బిజినెస్ అయింది. ఓవర్సీస్‌లో రైట్స్ 10 కోట్ల రూపాయలు మేర జరిగింది. ఈ చిత్రానికి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 126 కోట్ల మేర బిజినెస్ జిరిగింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో వరల్డ్ వైడ్ 5000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ఇక హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ సినిమాకు సుమారుగా 12 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. నైజాంలో 5 కోట్లకుపైగా వసూళ్లు నమోదు అయ్యాయి. 7 కోట్లకుపైగా ఆంధ్రాలో రాబట్టింది. ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమా 700K డాలర్లు అంటే.. సుమారుగా భారతీయ కరెన్సీలో 6 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 20 కోట్లకుపైగా ప్రీమియర్ల ద్వారా వసూలు చేసింది. ప్రీమియర్లతో కలిపి ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలి రోజు 80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











