Harihara Veeramallu Collection Day 10: దారుణంగా హరిహర వీరమల్లు కలెక్షన్స్.. 10వ రోజు ఎన్ని కోట్లంటే?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన మూవీ హరిహర వీరమల్లు. బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. వీఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. హరిహర వీరమల్లుకు తొలుత క్రిష్ జాగర్లమూడి ఆ తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు ఈ సినిమాను నిర్మించగా.. అగ్ర నిర్మాత ఏఎం రత్నం సమర్పించారు. జూలై 24న హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? 10వ రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..
హరిహర వీరమల్లు బడ్జెట్ & బిజినెస్
హరిహర వీరమల్లును రూ.250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 37 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 16 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 12 కోట్లు, తూర్పు గోదావవరిలో 9.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 9.5 కోట్ల రూపాయలు, కృష్ణా 7.6 కోట్లు, నెల్లూరు 4.4 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో పవన్ కళ్యాణ్ మూవీకి ఆంధ్రా, నైజాంలలో 103 కోట్ల రూపాయలు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే .. కర్ణాటక, తమిళనాడు, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో 12.5 కోట్లు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయలు మేర వీరమల్లు బిజినెస్ చేసింది. దాంతో వరల్డ్ వైడ్‌గా హరిహర వీరమల్లుకు 126 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జిరిగింది.

హరిహర వీరమల్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్
తెలుగు రాష్ట్రాలలో హరిహర వీరమల్లు లాభాల్లోకి రావాలంటే 104 కోట్ల రూపాయల షేర్.. 210 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. వరల్డ్ వైడ్‌గా పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 127 కోట్ల రూపాయల షేర్.. 260 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. భారీ అంచనాల నేపథ్యంలో హరిహర వీరమల్లును వరల్డ్ వైడ్‌గా 5000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
హరిహర వీరమల్లు 9 రోజుల కలెక్షన్స్
పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 13 కోట్ల రూపాయలు, ఫస్ట్ డే నాడు 35 కోట్ల రూపాయలు, రెండో రోజున రూ.9 కోట్ల నెట్, 3వ రోజున రూ.9 కోట్లు, 4వ రోజున 11 కోట్ల రూపాయలు, 5వ రోజున రూ.2 కోట్లు, 6వ రోజున 2 కోట్ల కలెక్షన్స్, 7వ రోజున 1 కోటి రూపాయలు, 8వ రోజున రూ.46 లక్షలు, 9వ రోజున 28 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా 9 రోజుల వరకు ఇండియా వైడ్ హరిహర వీరమల్లు మూవీకి 81 కోట్ల రూపాయల నెట్, 95 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఓవర్సీస్‌లోనూ హరిహర వీరమల్లుకు కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. ఇప్పటి వరకు అక్కడ 15 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో కలుపుకుని 9 రోజుల వరకు హరిహర వీరమల్లుకు 111 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి
తెలుగు రాష్ట్రాల్లో వీరమల్లు కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల వసూళ్లను పరిశీలిస్తే.. స్పెషల్ షోలతో 9 కోట్ల రూపాయలు, తొలి రోజున 32 కోట్ల రూపాయలు, 2వ రోజున 4 కోట్ల రూపాయలు, 3వ రోజున 5 కోట్ల రూపాయలు, 4వ రోజున 6 కోట్ల రూపాయలు, 5వ రోజున 2 కోట్ల రూపాయలు, 6వ రోజున 62 లక్షల రూపాయలు, 7వ రోజున 34 లక్షల రూపాయలు, 8వ రోజు 22 లక్షలు, 9వ రోజు 17 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో 9 రోజుల వరకు హరిహర వీరమల్లు తెలుగు రాష్ట్రాల్లో 57 కోట్ల రూపాయల షేర్, 84 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కలెక్షన్స్ పరిశీలిస్తే.. నైజాంలో 19 కోట్లు, సీడెడ్‌లో 8 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 8 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 6 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 4 కోట్ల రూపాయలు, గుంటూరులో 5 కోట్ల రూపాయలు, కృష్ణాలో 5 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2 కోట్ల రూపాయలు చొప్పున వసూళ్లు అందుకుంది హరిహర వీరమల్లు. ఇండియాలోని ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 10 కోట్ల రూపాయల షేర్.. 25 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది. మొత్తంగా హరిహర వీరమల్లు చిత్రం ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల వరకు 69 కోట్ల రూపాయల షేర్.. 112 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది.
హరిహర వీరమల్లు 10వ రోజు కలెక్షన్స్
హరిహర వీరమల్లు చిత్రం రోజురోజుకు కలెక్షన్స్‌ను కోల్పోతూనే ఉంది. మిక్స్‌డ్ టాక్‌తో పాటు కొత్త సినిమాల రాకతో ఈ మూవీకి బుకింగ్స్ పూర్తిగా పడిపోయాయి. వీకెండ్ అయినప్పటికీ బుకింగ్స్ పుంజుకోలేదు. 10వ రోజున హరిహర వీరమల్లుకు 50 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనితో కలిపి పవన్ కళ్యాణ్ మూవీకి 10 రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 113 కోట్ల రూపాయల వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 58 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











